NRI-NRT

కూరాశవు: AAEPOతో కలిసి పనిచేయనున్న St.Martinus విశ్వవిద్యాలయం

కురకావ్: AAEPOతో కలిసి పనిచేయనున్న St.Martins విశ్వవిద్యాలయం

కరిబీయబ్ దీవుల్లో ఒకటైన కూరాశవులో విద్యా సంస్థలకు గుర్తింపునిచ్చే Agency for the Accreditation of Educational Programs and Organizations (AAEPO) సంస్థతో కలిసి St.Martinus విశ్వవిద్యాలయం పనిచేస్తుందని ఆ యూనివర్శిటీ ఛాన్సలర్ డా.మురళీ గింజుపల్లి ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థలకు గుర్తింపునిచ్చే AAEPO వంటి సంస్థతో కలిసి తమ విశ్వవిద్యాలయం కలిసి పనిచేయడం హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. కిర్గిస్థాన్ దేశానికి చెందిన పలు సంస్థలు AAEPOతో అనుసంధానమయి గుర్తింపు ప్రక్రియను చేపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉప-కులపతి డా.డాన్న సొరియా, కూరాశవు విద్యా శాఖా మంత్రి సిత్రీ వన్ హేడూన్, ఆరోగ్య-ఆర్థిక శాఖా మంత్రి జేవియెర్ సిల్వేనియా, AAEPO డైరక్టర్ బక్తిబెవ్ ఇస్మైలోవ్, కూరాశవు ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు.