NRI-NRT

డెన్మార్క్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు….

డెన్మార్క్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు….

డెన్మార్క్‌లో అన్న నందమూరి తారక రామారావు శతజయంతి, మహానాడు వేడుకలు వైభవంగా జరిగాయి. తెలుగు ప్రజలందరూ అక్కడ ఒక్కటిగా వచ్చి ఆ మహనీయుడు గురించి నెమరువేసుకున్నారు. తెలుగు వాడి ఆత్మగౌరవం అన్న గారని కొనియాడారు. తెలుగు యువత, తెలుగు మహిళా, పార్టీ వివిధ విభాగాలకు సంబంధించిన అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు, చాలా చక్కగా జరుపుకున్నారు. ముందుగా కార్ ర్యాలీతో కార్యక్రమాన్ని ఆరంభించారు. ఆ తరువాత వివిధ ప్రసంగాలు అలానే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.

మహానాడులో భాగంగా డెన్మార్క్ తెలుగు యువత సభ్యులు పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, TDP డెన్మార్క్ కార్యవర్గ సభ్యులు వాటిని ఆమోదించారు. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి కావాలని, అలానే ఆంధ్రుల భవిషత్తు, యువత భవిషత్తు బాగుండాలని, మున్ముందు విదేశీ విద్య పథకం ప్రవేశ పెట్టి విద్యార్థులని ఆదుకోవాలని పిలుపు ఇచ్చారు.

నారా లోకేష్ యువనాయకత్వంలో మన రాష్ట్రానికి ఉజ్వల భవిషత్తు రాబోతుందని, యువగళం స్పందన చూస్తుంటే అది అర్థం అవుతోందని అన్నారు. చంద్రబాబు ఈ రోజు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అద్భుతంగా వుందని, అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వమైన స్పందన వస్తుందని పలువురు NRIలు కొనియాడారు. సైకో పాలన పోయి సైకిల్ పాలనా వచ్చి రాష్ట్రంలో అభిరుద్ధి, యువతకీ అవకాశాలు వచ్చి సుభిక్షంగా ఉండాలని ముక్తకంఠంతో నినదించారు.