వైతెపాను ఎందులోనూ విలీనం చేయనని, ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు ఉండబోవని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి గురువారం ఆమె నివాళి అర్పించారు.తాజాగా అయితే కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేసేస్తున్నారని ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే షర్మిల ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తో కేసీఆర్ డ్యూయెట్లు పాడుకుంటున్నారని, కేసీఆర్ కు సప్లై కంపెనీగా కాంగ్రెస్ మారిందని, విలీనం చేయడానికి ఇంత కష్టం పడాల్సిన అవసరం తనకెందుకు అని, విలీనం అని ఓ మహిళ కష్టాన్ని అవమానించకండని అంటున్నారు. నాడు తాను వస్తా అంటే వద్దు అనే పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నించిన ఆమె.. చివరికి కేసీఆర్ కూడా కాదనే వాడా? అభ్యర్థులను తయారు చేసుకుని పోటీ చేస్తామని ప్రకటించారు.