సూపర్ హీరో సినిమా అభిమానులకు శుభవార్త. తనదైన అడ్వెంచర్లతో ఆకట్టుకునే స్పైడర్ మాన్ 4వ పార్ట్ త్వరలోనే తెరకెక్కనుంది. మూడో పార్ట్ నటించిన టామ్ హోలాండ్, జెండయా ఈ చిత్రంలోనూ కనిపించనున్నారు. ఈ సినిమాను అమి పాస్కల్ నిర్మించనున్నారు..ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పీటర్ పార్కర్ పాత్రలో టామ్, ఎంజేగా జెండయా కనిపించనున్నారు. నిర్మాత అమీ పాస్కల్ మాట్లాడుతూ..‘మరో స్పైడర్ మ్యాన్ సినిమా తీయబోతున్నాం. రైటర్స్ గిల్డ్ అసోసియేషన్(డబ్ల్యూజీఏ) సమ్మె వల్ల సినిమా నిర్మాణ పనులు ఆగిపోయాయి. అది పూర్తవడంతోనే నిర్మాణ పనులను మొదలుపెడతాము’ అని అన్నారు. ఈ సినిమా కోసం ఎదురుచూసే కళ్లను ‘స్పైడర్ మ్యాన్’ ఎప్పుడు కనువిందు చేస్తుందో చూడాలి మరి.ఇప్పటికే వచ్చిన మూడు పార్టులు బాక్సాఫీస్ వద్ద అలరించాయి.