NRI-NRT

తానా 2023 Day2 Session2: రాజకీయ వాణిజ్య సదస్సులో కిక్కిరిసిన అతిథులు

తానా 2023 Day2 Session2: రాజకీయ వాణిజ్య సదస్సులో కిక్కిరిసిన అతిథులు

తానా 2023 మహాసభల్లో రెండోరోజు శనివారం నాడు మధ్యాహ్నం కార్యక్రమాల్లో భాగంగా పలు సెమినార్లు సమావేశాలు నిర్వహించారు. రాజకీయ సదస్సులో తెలుగు రాజకీయ నాయకులు, ప్రవాస రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అమెరికా రాజకీయాల్లో ప్రవాసుల పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వాణిజ్య సదస్సులో డా. ఎల్లా కృష్ణ పాల్గొని తాన అనుభవాలు, అభిప్రాయాలను సభికులతో పంచుకున్నారు. వాణిజ్య సదస్సు జరిగిన హాలు జనంతో నిండి కిక్కిరిసింది. తెలుగు రాజకీయ నాయకుల్లో భరత్, జయరాం కోమటి, పాతూరి నాగభూషణం, మన్నవ సుబ్బారావు, వేమూరు రవికుమార్, రఘురామరాజు, టీడీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. బాలకృష్ణ NTR ప్రాంగణ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆయనకు భద్రతగా ప్రవాసులు వాలంటీర్లుగా అభిమానులను నియంత్రించారు.