Politics

త్వరలో కేంద్ర కేబినెట్​లో​ మార్పులు

త్వరలో కేంద్ర కేబినెట్​లో​  మార్పులు

కేంద్ర కేబినెట్‌లో (Central Cabinet)  మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అంటే అవున‌నే సామాధానం వినిపిస్తోంది.  ఈ ఏడాది ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు (Five State Elections) , వ‌చ్చే ఏడాది పార్ల‌మెంట్‌కు ఎన్నిక‌లు (Loksabha Elections) జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు కోసం సమాయాత్తం అయ్యేందుకు కేంద్ర ప్ర‌భుత్వం (Central Govt)సిద్దం అవుతున్న‌ది.  కాగా, కేంద్ర ప్ర‌భుత్వం కేబినెట్‌లో మార్పులు చేయాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించింది.  ఈనెల 20 నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు (Monsoon Session) ప్రారంభం కానున్నాయి.  అంతేకాదు, ఈనెల 16న ప్ర‌ధాని మోడీ ఫ్రాన్స్‌కు వెళ్ల‌నున్నారు.  కాగా, ఈలోగానే కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

దీనికి సంబంధించి ప్ర‌స్తుతం సుమాలోచ‌న‌లు జ‌రుగుతున్నాయి.  రాబోయే నాలుగైదు రోజుల్లో కొత్త కేబినెట్ కొలువుదీర‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.  అయితే, ఈ కొత్త కేబినెట్‌లో ఎవ‌రికి అవ‌కాశం ఉంటుంది.. ఎవ‌రి ప‌దవులు ఉంటాయి, ఎవ‌రి ప‌ద‌వులు మారిపోతాయనే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.  ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాల అధ్య‌క్షుల‌ను మార్చారు.  కొంత‌మంది కేంద్ర మాజీ మంత్రుల‌ను ఎన్నిక‌ల ఇన్‌చార్జ్‌లుగా నియ‌మించారు.  కొత్త‌గా మ‌రికొంత‌మందిని కేబినెట్‌లోకి తీసుకునే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో ఏం జ‌ర‌గ‌బోతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.