NRI-NRT

వైభవంగా సిలికానాంధ్ర సంస్థాపన దినోత్సవం

వైభవంగా సిలికానాంధ్ర సంస్థాపన దినోత్సవం

సిలికానాంధ్ర సంస్థ ఆవిర్భవించి 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నాడు కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో గల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని వైభ్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో 20మంది స్థానిక ప్రవాసులు కలిసి ప్రదర్శించిన శ్రీనాథుడు పద్య నాటకం రక్తి కట్టించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన డా. లకిరెడ్డి హనిమిరెడ్డి గుమ్మడి ప్రదర్శనను అభినందిస్తూ 10వేల డాలర్లను బహుమతిగా అందజేశారు. ఐఐటీ హైదరాబాద్ డీన్ డా. బీ.ఎస్.మూర్తి ప్రసంగిస్తూ సిలికానాంధ్ర సంస్థతో కలిసి రాబోయే రోజుల్లో సమ్యుక్త కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల, మనబడి కులపతి రాజు చమర్తి, సిలికానాంధ్ర సభ్యులు దిలీప్ కొండిపర్తి, వేదుల స్నేహ, శాంతి కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.