Agriculture

ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్ష సూచన

ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్ష సూచన

ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఇది ఇప్పటికే శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కొన్ని చోట్ల వర్షం కురిసింది. నేడు (ఆదివారం) కూడా అలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటిదేమీ జరగకపోయినా… తూర్పు ఆసియా, ఆగ్నేయ దేశాల నుంచి వస్తున్న మేఘాలు… బంగాళాఖాతంలో కురుస్తూ… అల్పపీడనంలా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, జనగాం, సిద్దిపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం మారిపోయింది. చిన్నపాటి వర్షం కురుస్తోంది. కానీ.. ఫలానా ప్రాంతంలో కాదు.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మేఘాలు.. అక్కడక్కడ ఘాటుగా.. కొన్ని చోట్ల సన్నగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న చోట మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు ఎండలు బాగానే ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అక్కడ వర్షం పడదు. ఈ నాలుగు రోజుల్లో వర్షాలు బాగా పడితే మంచిది. సెప్టెంబరు నుండి ఎక్కువ వర్షాలు పడవు.దేశంలోనూ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న చలి గాలులు..కొన్ని మేఘాలను కమ్ముకుంటూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు లడఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రాష్ట్రాలపై అనేక పొరల మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది. బీహార్, అస్సాం, మేఘాలయ, సిక్కింలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. అక్కడ తీవ్ర మేఘాలు కమ్ముకున్నాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉండటం మంచిది.