Politics

“పుష్ప”ను కూడా చంద్రబాబు వాడుకుంటారు

‘పుష్ప’ సినిమాకు అవార్డు  పై విమర్శలు: విజయసాయిరెడ్డి

‘పుష్ప’ సినిమాకు అవార్డు రావడవపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు పేల్చారు. ‘పుష్ప’ ను ఉద్దేశించి.. చంద్రబాబుపై విమర్శలు చేశారు విజయసాయిరెడ్డి. నలుగురి దృష్టిని ఆకర్షించే ఘటన ఎక్కడ జరిగినా దానిని తనకే ఆపాదించుకుంటారు చంద్రబాబు గారు. ‘పుష్ప’ హీరో అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడానికి కూడా తానే స్ఫూర్తి అని అన్నా అంటాడంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.‘నా హయాంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కింది. ఎందరో పుష్పరాజ్ లను నేనే తయారుచేశా. పుష్ప పార్ట్ 2 కూడా వస్తోంది తమ్ముళ్లూ’ అని బాబు బాంబు పేలుస్తాడేమో! అని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. రాజకీయాల్లో విజేతలు, హుందాగా ఉండే వారి మాటలకే సమాజం లో గౌరవం ఉంటుంది. పరాజితులు, ఒకప్పటి రౌడీ షీటర్లు, చిల్లర నేరగాళ్లు వార్నింగులిస్తే వీధి కుక్కలు కూడా భయపడవు. వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా గెలుస్తామనే ధీమా టీడీపీలో ఒక్కడికీ లేదని మరో ట్వీట్ లో పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి.