Devotional

ఈ రాశివారికి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి

ఈ రాశివారికి కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 05.09.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (05-09-2023)

మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడం ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మీదేవి దర్శనం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (05-09-2023)

మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోవద్దు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మీ సహస్రనామ పారాయణ శుభప్రదం
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (05-09-2023)

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (05-09-2023)

మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటే ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావాలి. మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (05-09-2023)

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (05-09-2023)

చేసిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనఃస్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (05-09-2023)

శుభకాలం. కొన్ని విషయాలలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను అందుకుంటారు . వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో సహాయం చేసేవారు ఉన్నారు. శివారాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (05-09-2023)

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనఃశ్శాంతి ఉంటుంది. బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికను సిద్ధం చేయండి. ఆదిత్యహృదయం చదవడం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (05-09-2023)

శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ఒక ముఖ్యమైన పనిని కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించేవారు ఉన్నారు జాగ్రత్త. దుర్గానామాన్నిజపించాలి.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (05-09-2023)

కీలక వ్యవహారాలలో అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (05-09-2023)

మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (05-09-2023)

చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.శ్రీవేంకటేశ్వరుణ్ణి పూజించడం వల్ల ఆపదలు తొలగుతాయి.
🦈🦈🦈🦈🦈🦈🦈