DailyDose

హైదరాబాద్ నగరంలో ఆగని వర్షం

హైదరాబాద్ నగరంలో ఆగని వర్షం

హైదరాబాద్‌లో పలుచోట్ల ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీబీ కాలనీ, విన్‌ ఆల్‌ కాలనీ, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట్‌, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్‌బీనగర్‌, సాగర్‌ రోడ్‌, హస్తినాపురం, సికింద్రాబాద్‌, ప్యాగం కలగూడ, బోయిన్‌పల్లి , తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది. పలు చోట్ల సోమవారం రాత్రి నుంచి పడుతూనే ఉంది. వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

నేడు పలు జిల్లాలో నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు ఉన్నాయి.