Fashion

భారతీయులకు ఇష్టమైన విహార ప్రదేశాలు ఇవే

భారతీయులకు ఇష్టమైన విహార ప్రదేశాలు ఇవే

వేసవి అంటే వెంటనే గుర్తుకొచ్చేది విహారమే. దాదాపుగా ప్రతీఒక్కరూ కుటుంబంతో కలసి అలా టూర్‌ వెళ్లి రావాలనుకుంటారు. దానికోసం ఏ ప్రాంతం వెళ్తే బాగుంటుందని సెర్చ్‌ చేస్తారు. ఇలా తమ వెబ్‌సైట్‌లో శోధించిన వాటిలో అయోధ్య (Ayodhya), లక్షద్వీప్‌ (Lakshadweep), నందీహిల్స్‌ (Nandi Hills) ముందు వరుసలో నిలిచాయని ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సంస్థ మేక్‌మై ట్రిప్‌ (MakeMyTrip) వెల్లడించింది. గోవాను కూడా ఎక్కువమంది సెర్చ్‌ చేశారని పేర్కొంది. మార్చి- ఏప్రిల్‌ 2024 డేటా ఆధారంగా రూపొందించిన నివేదికను బుధవారం విడుదల చేసింది. మేక్‌మైట్రిప్‌ విడుదల చేసిన డేటా ప్రకారం.. పూరీ, వారణాసి ఎక్కువమంది సెర్చ్‌ చేసిన తీర్థయాత్రల జాబితాలో ఉన్నాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణాల విషయానికొస్తే.. బాకు, అల్మాటీ, నగోయా ప్రాంతాలను ఎక్కువమంది శోధించారట. వీటితో పాటు లక్సెంబర్గ్‌, లంకావి, అంటల్యా కూడా ఉన్నాయి. 2023 వేసవితో పోలిస్తే ఫ్యామిలీ ట్రావెల్‌ విభాగం 20 శాతం పెరిగితే, సోలో ట్రావెల్‌ 10 శాతం వృద్ధి చెందిందని మేక్‌మై ట్రిప్‌ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ వేసవిలో శోధనలు పెరిగాయని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజేష్‌ మాగో తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z