Devotional

Telugu Horoscope – May 10 2024

Telugu Horoscope – May 10 2024

మేషం
మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యానం వల్ల మేలు జరుగుతుంది.

వృషభం
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గురువుని ఆరాధించడం మంచిది.

మిథునం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మీ మీ రంగాల్లో నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి,మంచి ఫలితాలు సొంతం అవుతాయి. ఎవరినీ అతిగా విశ్వసించకండి. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.

కర్కాటకం
సౌభాగ్య సిద్ధి ఉంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. బంధువుల సహకారం ఉంటుంది.భోజన సౌఖ్యం ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. శ్రీలక్ష్మీ ఆరాధన శుభప్రదం.

సింహం
కార్యసిద్ధి ఉంది. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవ ప్రార్థన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు.

కన్య
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను వెతకాలి. బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. శివుడినీ ఆరాధిస్తే మంచిది.

తుల
మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. శ్రమ అధికం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీదత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చికం
కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే నెరవేరుతాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. ఆర్థికలావాదేవీలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. గురు చరిత్ర పారాయణ శుభప్రదం.

ధనుస్సు
ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదేవతా స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

మకరం
జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆర్థిక పరమైన జాగ్రత్తలు అవసరం. ఆపదతో పాటు కష్టాలు ఎదురవుతాయి. ఒక వార్త మనోవిచారాన్ని కలిగిస్తుంది. కలహ సూచన. ఎలాంటి ఆవేశాలకు పోకూడదు. శ్రమ అధికం అవుతుంది. లింగాష్టకం చదవడం వల్ల పనులలో విజయంతో పాటు మంచి జరుగుతుంది.

కుంభం
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటం మేలు. చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. నారాయణ మంత్రాన్ని జపించాలి.

మీనం
దైవబలంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం పొందుతారు. శ్రీలక్ష్మీదేవిని ఆరాధిస్తే బాగుంటుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z