Business

తెలంగాణాలో బంగారం హాల్‌మార్కింగ్‌ పరిధి పెంపు

తెలంగాణాలో బంగారం హాల్‌మార్కింగ్‌కు కొత్త నిబంధన

ఇప్పుడు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది కేంద్రం. తెలంగాణలో ఇంతకుముందు ఏడు జిల్లాల్లో మాత్రమే హాల్ మార్కింగ్ నిబంధన అమల్లోకి వచ్చింది. తాజాగా కేంద్రం 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 55 జిల్లాల్లో హాల్ మార్కింగ్ పాలసీని కేంద్రం విస్తరించింది. దీంతో తెలంగాణలో కొత్తగా ఐదు జిల్లాల్లో బంగారం ఆభరణాలు విక్రయించాలంటే హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. ఇంతకుముందు మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో.. హాల్ మార్కింగ్ నిబంధన అమలు కాగా, తాజాగా మేడ్చల్-మల్కాజిగిరి, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలు చేరాయి.