Kids

చిన్నారుల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సెల్‌ఫోన్లు

చిన్నారుల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న సెల్‌ఫోన్లు

తమ చిన్నారులు స్మార్ట్ ఫోన్‌ను ఆపరేట్‌ చేస్తున్నారని సంతోషించే పేరెంట్స్‌ అనారోగ్యాన్ని పంచుతున్నారని తెలుసుకోలేక పోతున్నారు. ఈ విషయం చెబుతోంది మరెవరో కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. పిల్లలు గంటల తరబడి టీవీ చూడడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. చిన్నారుల్లో మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. చిన్నతనంలో అధికంగా ఫోన్‌ చూసే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు పిల్లల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 5ఏళ్ల లోపు చిన్నారులు రోజులో ఒక గంట కంటే ఎక్కువ ఫోన్‌ చూడకూడదని చెబుతున్నారు. పిల్లలకు స్క్రీన్‌ టైమ్‌ను వీలైనంత వరకు తగ్గించాలని చెబుతున్నారు. రేడియేషన్‌ ప్రభావం కూడా పిల్లలపై నెగిటివ్‌ ఇంపాక్ట్ చూపుతుందని చెబుతున్నారు.

స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌ల నుంచి విడుదలయ్యే బ్లూ లైట్‌ వారి కళ్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. చిన్నారుల నిద్రపై కూడా దుష్ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్‌కు బానిసలుగా మారి, ఎవరితో మాట్లాడకుండా ఉండే చిన్నారుల మానసిక ప్రవర్తనలోనూ భయంకరమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు. పిల్లలకు ఫిజికల్‌ యాక్టివిటీని పెంచాలని, స్మార్ట్ ఫోన్‌ల వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.