Agriculture

కిలో టమాటా అర్ధ రూపాయి

కిలో టమాటా అర్ధ రూపాయి

ఇటీవల రూ.200లకు చేరిన టామటా ధర.. ప్రస్తుతం భారీగా పతనమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కొన్ని రోజులుగా కిలో టమాటా రూ.3..4 పలికింది. ఆదివారం మరింత పతనమై కిలో టమాటా 50పైసలకు చేరింది. మంచి దిగుబడి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో టమాటా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ ప్రాంతంలో ప్రతి రైతు ఏటా కనీసం అర ఎకరా నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తారు. సెప్టెంబరులో అధిక మొత్తంలో సరకు వస్తుండటంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. మంచి నాణ్యత ఉన్న టమాటాను సైతం వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే టమాటా రైతులకు అప్పులు తప్ప ఏమీ మిగలవని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.