Movies

మంచి కలెక్షన్లు అందుకుంటున్న “శెట్టి” సినిమా

మంచి కలెక్షన్లు అందుకుంటున్న “శెట్టి” సినిమా

న‌వీన్ పొలిశెట్టి, అనుష్కా శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సెప్టెంబ‌ర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లో క‌లెక్ష‌న్‌ల ప‌రంగా ఈ సినిమా అరుదైన ఘనత సాధించింది. కలెక్షన్ల పరంగా ఈ సినిమా నిర్మాతలకు ఓవర్సీస్‌లో కాసులు కురిపిస్తోంది. ఇవాళ్టి అప్‌డేట్ ప్రకారం యూఎస్‌లో ఈ మూవీ 1.5 మిలియన్ డాలర్స్ రాబట్టిన‌ట్లుగా డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ హవాతో 2 మిలియన్ డాలర్స్‌కి కూడా చేరుకుంటుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. కాగా మ‌రోవైపు ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ‘నెట్‌ఫ్లిక్స్‌’ దక్కించుకోగా.. శాటిలైట్‌ రైట్స్‌ను ‘జీ’ టీవీ సొంతం చేసుకుంది.