Business

హైదరాబాద్‌లో నకిలీ ఐ ఫోన్ల కలకలం-నేటి వాణిజ్య వార్తలు

హైదరాబాద్‌లో నకిలీ ఐ ఫోన్ల కలకలం-నేటి వాణిజ్య వార్తలు

హైదరాబాద్‌లో నకిలీ ఐ ఫోన్ల కలకలం

హైదరాబాద్ మార్కెట్లలో నకిలీ ఐ ఫోన్ల అమ్మకం కలకలం రేపింది. నగరంలో నకిలీ ఐ ఫోన్లు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి వెయ్యి నకిలీ ఐ ఫోన్లు, ఇయర్ ఫోన్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మొబైల్ షోరూమ్‌తో పాటు మోండా మార్కెట్, జగదీష్ మార్కెట్లలో నకిలీ ఐ ఫోన్లు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా రాజస్థాన్ నుండి నకిలీ ఐ ఫోన్లను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. ఈ ముఠా వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

*  మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్ళీ భారీ పెరుగుదల దిశవైపు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు ఒక గ్రామ్ గోల్డ్ ధర రూ. 400 నుంచి రూ. 410 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.ఈ రోజు విజయవాడలో 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5315 (ఒక గ్రామ్), 24 క్యారెట్స్ పసిడి ధర రూ. 5798 (ఒక గ్రామ్)గా ఉన్నాయి. దీని ప్రకారం 10 గ్రామ్స్ పసిడి ధరలు వరుసగా రూ. 53150 & రూ. 57980గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు రూ. 400, రూ. 410 ఎక్కువ. ఇదే ధరలు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి.చెన్నైలో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కావున నిన్నటికి.. ఈ రోజుకి పెద్దగా తేడా లేదు. 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 5370 కాగా, 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 5858గా ఉంది. ఈ లెక్కన 10 గ్రామ్స్ గోల్డ్ ఖరీదు వరుసగా రూ. 53700 & రూ. 58580గా ఉంది.దేశ రాజధాని ఢిల్లీలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇక్కడ ఒక గ్రామ్ 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 5330 & ఒక గ్రామ్ 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 5813గా ఉంది. దీని ప్రకారం 10 గ్రాముల పసిడి ధర రూ. 53300.. రూ. 58130 గా ఉంది.

సాక్షి’లోకి షెల్ కంపెనీల ద్వారా వందల కోట్ల పెట్టుబడులు’

టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి సీఎం జగన్​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తండ్రి సీఎం పదవిని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోచేసిన చరిత్ర జగన్‌రెడ్డి సొంతమని.. సాక్షిలోకి 1,256 కోట్ల రూపాయలు పెట్టుబడులు వివిధ షెల్ కంపెనీల నుంచి వచ్చాయని ఆరోపించారు. 2004, 2005, 2006లో వచ్చిన ఈ పెట్టుబడులు..  ఎవరు పెట్టారో తెలియాలన్నారు. 10 రూపాయలు ఉన్న షేరు 350 రూపాయలకు ఎలా వచ్చిందని నిలదీశారు. పలు కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయని అందులో.. విజయసాయి రెడ్డి వియ్యంకుడు అరబిందో సైతం ఉన్నారని తెలిపారు. అప్పుడే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో అరబిందోకు సంబంధాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యమన్నారు. అదే విధంగా 22 షెల్ కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు పెట్టాయని సాక్షాత్తు సీబీఐనే చెబుతోందని.. ఇవన్నీ చూశాక ఆర్థిక ఉగ్రవాది ఎవరు అనేది వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని అడ్డంపెట్టుకుని షెల్‌ కంపెనీల నుంచి సాక్షిలోకి పెట్టుబడులు (Shell Companies Investments in Sakshi) వచ్చాయా.. లేదా అని సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. 

నేడు గ్యాస్ సిలిండర్ ధరలు

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల చాలా రోజుల తర్వాత మొత్తానికి గృహ వినియోగ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచారు.హైదరాబాద్: రూ. 966,వరంగల్: రూ. 974,విశాఖపట్నం: రూ. 912,విజయవాడ: రూ. 927,గుంటూర్: రూ. 944.

ఖమ్మంలో షాపింగ్ మాల్‌‌‌‌ ప్రారంభించిన జేసీ మాల్

 జేసీ మాల్ ఖమ్మంలో షాపింగ్ మాల్‌‌‌‌ ఓపెన్ చేసింది. ఇక్కడ  క్లాత్స్‌‌‌‌,  సిల్వర్ జ్యుయెలరీ అమ్ముతారు. సినీ నటి రీతు వర్మ ఈ మాల్‌‌‌‌ను  శనివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ నాణ్యమైన, నమ్మకమైన బట్టలు, వెండి ఆభరణాలు అతి తక్కువ ధరకే జేసీ మాల్‌‌‌‌లో దొరుకుతాయని చెప్పారు.  రీతు వర్మను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాలు జనాలతో  నిండిపోయింది. ఈ కార్యక్రమంలో జేసీ మాల్  నిర్వహకులు కృష్ణారావు, వెంకటరెడ్డి, మర్రి జమున రెడ్డి, మర్రి మధుమతి రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఇండియన్‌ ఫుడ్‌కు భారీ డిమాండ్‌

భారతీయ ఆహార ఉత్పత్తులకు బయటి దేశాల్లో భారీ డిమాండ్‌ ఉంటోంది. అందుకు అనుగుణంగా దిగుమతులకు వీలు కల్పించాలని ఆయా దేశాలు భారత్‌ను వేడుకుంటున్నాయి.  భారత్‌ నుంచి చికెన్, డైరీ, బాస్మతి రైస్, ఆ‍క్వా, గోధుమ ఉత్పత్తులకు మధ్యప్రాచ్య దేశాలలో భారీ డిమాండ్ ఉందని యుఏఈ ఆహార పరిశ్రమ తెలిపింది. వీటి దిగుమతుల కోసం భారత ప్రభుత్వ మద్దతును కోరుతోంది. అగ్రికల్చరల్ & ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) సమన్వయంతో ధ్రువీకరణ ప్రక్రియలు సజావుగా జరిగేలా సహకరించాలని యూఏఈ ఆహార పరిశ్రమ భారత్‌ను కోరింది. బహ్రెయిన్, కువైట్, సుల్తానేట్ ఆఫ్ ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) వంటి దేశాలలో ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడానికి భారత ఉత్పత్తుల అధిక నాణ్యత ప్యాకేజింగ్ సహాయపడుతుందని పేర్కొంటోంది.ఇటీవల యూఏఈలో పర్యటించిన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడి దిగుమతిదారులతో వివరణాత్మక చర్చలు జరిపారు. భారత్‌ నుంచి ఎగుమతులను పెంచే మార్గాలపై చర్చించారు. ఈ దేశాలలో ఫ్రోజెన్‌ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతదేశానికి భారీ అవకాశాలు ఉన్నాయని గ్లోబల్ ఫుడ్ ఇండస్ట్రీస్ LLC సేల్స్ UAE హెడ్ నిస్సార్ తలంగర అన్నారు. భారతీయ బాస్మతి బియ్యానికి డిమాండ్ ఉందని, ఈ బియ్యంపై కనీస ఎగుమతి ధర (MEP) తగ్గింపు భారత్‌ ఎగుమతులను పెంచడంలో సహాయపడుతుందని ఒమన్‌కు చెందిన ఖిమ్జీ రాందాస్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం టన్నుకు 1,200 డాలర్లుగా ఉన్న MEPని 850 డాలర్లకు తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.జీసీసీ (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి మరొక దిగుమతిదారు హలాల్ సర్టిఫికేషన్ సమస్యను లేవనెత్తారు. భారత్‌లో అత్యంత మెరుగైన హలాల్ మాంసం ధ్రువీకరణ వ్యవస్థ ఉంది.  అల్లానాసన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫౌజాన్ అలవి మాట్లాడుతూ భారత్‌,  యూఏఈ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మాంసం ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. చోయిత్రమ్స్ హెడ్ (రిటైల్ ప్రొక్యూర్‌మెంట్) కీర్తి మేఘనాని కూడా  ఇదే విధమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఉత్పత్తుల ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టడం వల్ల యూఏఈ, ఇతర గల్ఫ్ ప్రాంత దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారతీయ ఎగుమతిదారులు సహాయపడతారన్నారు. యాప్‌కార్ప్ హోల్డింగ్ చైర్మన్ నితేష్ వేద్ మాట్లాడుతూ ఇక్కడ ఏపీఈడీఏ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల ఆహార పరిశ్రమకు దోహదపడుతుందని సూచించారు.GCC గ్రూప్‌కు చెందిన మరో దిగుమతిదారు మాట్లాడుతూ భారతీయ కుటీర పరిశ్రమలు తయారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ ఉందని, దీని కోసం భారతదేశం ప్రమాణాలు, ప్యాకేజింగ్, లేబులింగ్‌కు సంబంధించిన సమస్యలను చూడాల్సి ఉందని చెప్పారు.భారత్-యూఏఈ వాణిజ్య ఒప్పందం గతేడాది మేలో అమల్లోకి వచ్చింది. దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2021-22లో 72.9 బిలియన్‌ డాలర్ల నుంచి 2022-23లో 84.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.

ప్యూర్‌‌‌‌ ఈవీ నుంచి  సరికొత్త  స్కూటర్‌‌‌‌

ఎలక్ట్రిక్ స్కూటర్ ఈఫ్లూటో  7జీ మ్యాక్స్‌‌ను ప్యూర్ ఈవీ లాంచ్ చేసింది. ఫుల్ ఛార్జ్‌‌పై 201 కి.మీ వెళ్లొచ్చని కంపెనీ చెబుతోంది. ఈ బండిలో రివ‌‌ర్స్ మోడ్  ఫీచర్‌‌‌‌ ఉంది. ధర రూ. 1.15 లక్షలు. బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.  ఈఫ్లూటో  7జీ మ్యాక్స్‌‌లో 3.5 కీ.వాట్‌‌హవర్స్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్‌‌‌‌లో  మూడు రైడింగ్ మోడ్‌‌లు ఉన్నాయి.

తక్కువ పెట్టుబడితో చేయదగ్గ వ్యాపారాలు ఇవే

తక్కువ పెట్టుబడితో చేసే ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారం చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు ఏం చేయాలో ఐడియా ఉండదు. ఈరోజుల్లో అసలు ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. కాబట్టి చిన్నదైనా సరే ఏదో ఒక వ్యాపారం చేయాలని యువత ఆలోచిస్తున్నారు. కేవలం 10 వేలతో కూడా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. అలాంటి బిజినెస్‌ ఐడియాస్‌ మీకోసం.టిఫిన్ సర్వీస్:మీకు వంట చేయడం వచ్చినట్లైతే.. మీరు టిఫిన్ సెంటర్‌ను పెట్టుకోవచ్చు. ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే హడావుడిలో చాలా మందికి సరైన ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన టిఫెన్‌ ఉండదు. మీరు చూసే ఉంటారు.. నగరాల్లో సైకిల్‌ మీద నాలుగు ఐదు రకాల టిఫెన్స్‌ తెచ్చి విక్రయిస్తుంటారు. ఇక్కడ ఎవరు తింటారు అనుకోవచ్చు. లక్షల్లో జీతాలు వచ్చేవాళ్లు కూడా అలా రోడ్‌ సైడ్‌ టిఫెన్‌ సెంటర్లోనే తింటారు. మీ ప్రాంతం చుట్టూ ఉన్న కొద్దిపాటి ప్రచారం కస్టమర్‌లను సులభంగా పొందడంలో మీకు సహాయపడుతుంది.పచ్చళ్లు, చట్నిపూడి, చిరుతిళ్ల వ్యాపారం:ఇంట్లో కరకరలాడే చిరుతిళ్లు, పచ్చళ్లు, చట్నిపూడి, చక్కెర, పులియోగార గుజ్జు మొదలైన వాటికి బాగా గిరాకీ ఉంది. ప్రారంభంలో మీరు మీ ప్రాంతం చుట్టూ ప్రకటనలు చేయాల్సి రావచ్చు. మీ ఆహారం రుచిగా ఉంటే, కస్టమర్ల సంఖ్య పెరుగుతుంది.సాంఘిక ప్రసార మాధ్యమం:నేడు Facebook, YouTube, Instagram నుంచి చాలా డబ్బు సంపాదించే వ్యక్తులు ఉన్నారు. వంట అయినా, కామెడీ అయినా, ట్రెక్కింగ్ అయినా, ఎథిక్స్ నేర్పించడం అయినా, మీకు ప్రత్యేక నైపుణ్యం లేదా ఆసక్తి ఉంటే, మీరు వీడియోలను రూపొందించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని నుండి సంపాదించవచ్చు. అయితే దీనికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అనుకున్నంత త్వరగా ఏం పైసల్‌ రావు. ఫాలోవర్స్, వ్యూవర్స్‌ బాగా పెరగాలి.యోగా క్లాస్:మనస్సు శరీర ఆరోగ్యానికి యోగా చాలా అవసరం. మీకు యోగాసనాలు చేయడం వస్తే.. ఇంట్లోనే ఆన్‌లైన్‌ క్లాసులు ఏర్పాటు చేయవచ్చు. లేదా యోగా సెంటర్‌ను స్టాట్‌ చేయొచ్చు. ఈరోజుల్లో యోగా, జిమ్‌కు బాగా డిమాండ్‌ ఉంది.

*  నేటి పెట్రోల్ డీజిల్ ధరలు

వాహనదారులు ఎక్కువగా వినియోగించే గత కొద్ది కాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1 తేదీన సవరిస్తుంటారు. కానీ, కొన్ని నెలల నుంచే ఈ ధరల్లో ఎలాంటి మార్పులు జరగకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 109.66,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.31 విశాఖపట్న:లీటర్ పెట్రోల్ రేట్లు: రూ. 110.48,లీటర్ డీజిల్ ధరలు: రూ. 98.విజయవాడ:లీటర్ పెట్రోల్ ధరలు: రూ. 111.76,లీటర్ డీజిల్ ధరలు: రూ.99.