DailyDose

భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు

భద్రతా పనుల కారణంగా విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 6 నుంచి 12వ తేదీ వరకు గుంటూరు-విశాఖ(17239) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌, రాజమహేంద్రవరం- విశాఖ(07466) మెమూ, విశాఖ- రాజమహేంద్రవరం(07467) మెమూ.., ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు విశాఖ-గుంటూరు (17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు.

చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు: దీపావళి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండడంతో చెన్నై సెంట్రల్‌-భువనేశ్వర్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌- భువనేశ్వర్‌(06073) ప్రత్యేక రైలు ఈనెల 13, 20, 27 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.15 గంటలకు దువ్వాడ చేరుకుని, 11.20గంటలకు బయలుదేరి వెళుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో భువనేశ్వర్‌- చెన్నై సెంట్రల్‌ (06074) ప్రత్యేక రైలు ఈనెల 14, 21, 28 తేదీల్లో రాత్రి 9గంటలకు భువనేశ్వర్‌లో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45గంటలకు దువ్వాడ వస్తుందన్నారు. ఇక్కడి నుంచి 3.50గంటలకు బయలుదేరి వెళుతుందన్నారు.

సూరత్‌-బ్రహ్మపుర మధ్య: సూరత్‌-బ్రహ్మపుర (09069) ప్రత్యేక రైలు ఈనెల 8, 15, 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 2.20గంటలకు సూరత్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.10గంటలకు దువ్వాడ, రాత్రి 8.58 గంటలకు పెందుర్తికి చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర-సూరత్‌ (09070) ప్రత్యేక రైలు ఈనెల 10, 17, 24, డిసెంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో తెల్లవారుజామున ఉదయం 3.30 గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 7.10గంటలకు పెందుర్తికి, 8.20గంటలకు దువ్వాడకు చేరుకుంటుందన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z