DailyDose

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా- నేర వార్తలు

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా- నేర వార్తలు

చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇవాళ హైకోర్టులో సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు చంద్రబాబు కంటి ఆపరేషన్‌, ఆరోగ్య పరిస్థితి వివరాలను ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.చంద్రబాబు కుడి కంటికి శస్త్రచికిత్స నిర్వహించాం. ఆయన కోలుకోవడానికి తప్పనిసరిగా మందులు వాడాలి. ఐదు వారాల పాటు ఐ చెకప్‌ కోసం షెడ్యూల్‌ ఇచ్చాం. కంటికి 5 వారాల పాటు ఇన్‌ట్రా ఆక్యులర్‌ ప్రెజర్‌ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 వారాల పాటు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. చంద్రబాబు గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. గుండె పరిమాణం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో సమస్యలున్నాయి. మధుమేహం అదుపులో ఉంది.. జాగ్రత్తలు పాటించాలి. ఆయనకు తగినంత విశ్రాంతి అవసరం’’ అని వైద్యులు సూచించిన నివేదికను కోర్టుకు అందించారు. మిగిలిన వాదనలు గురువారం వింటామని ధర్మాసనం తెలిపింది.

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు ముగిశాయి. ఈ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లో ఏడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అటు.. ప్రదీప్‌రెడ్డి ఇంట్లోనూ భారీగా నగదు సీజ్‌ చేశారు. ఎన్నికల కోసం డబ్బును సమకూర్చినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.

రాజీవ్‌ హత్య కేసు దోషుల పిటిషన్‌

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య దోషులుగా తేలిన రాబర్ట్ పయస్, జయకుమార్ తమను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పయస్‌, జయకుమార్‌ ఇద్దరు ప్రస్తుతం తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరంలో ఉన్నారు. వారిద్దరినీ గతేడాది పుజాల్ సెంట్రల్ జైలు నుంచి మురుగన్ తిరుచ్చిలోని ప్రత్యేక శిబిరానికి తరలించార. ఇద్దరు హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేసిన ఇద్దరూ.. ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఇదే కేసులో ఎంటీ శాంతన్‌ను సైతం స్పెషల్‌ క్యాంపు నుంచి తనను విడుదల చేయాలని ఇంతకు ముందు కోరారు.ప్రత్యేక క్యాంపు గదిలోని కిటికీ సైతం మూసే ఉందని.. ఇతరులను కలిసే స్వేచ్ఛ తనకు లేదని శాంతన్‌ ముందు ఆరోపించారు. ప్రత్యేక శిబిరంతో పోలిస్తే జైలే బాగుండేదని పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో రాజీవ్‌ హత్య కేసులో ఆరుగురు నిందితులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అనంతరం నిందితులను ప్రత్యేక శిబిరంలో ఉంచారు. 1991లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మురుగన్, నళిని, ఏజీ పెరారివాలన్, సంతన్, జయకుమార్, రాబర్ట్ పయాస్‌, పీ రవిచంద్రన్‌లతో ఏడుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికీ మరణశిక్ష విధించగా.. ఆ తర్వాత జీవితఖైదుగా మార్చారు. ఏడుగురు ఖైదీల్లో ఏజీ పెరారివాలన్‌ 2022 మేలో జైలు నుంచి విడుదలయ్యారు.

జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్‌లో ఆర్మీ జవాన్ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌కు చెందిన రాజిందర్ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.

యువకుడిని కొట్టిన నటుడు

తన విలక్షణ నటనతో బాలీవుడ్‌లో పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు సీనియర్‌ నటుడు నానా పటేకర్‌ (Nana Patekar). ఇటీవల ‘ది వ్యాక్సిన్‌ వార్‌’తో ప్రేక్షకులను అలరించిన ఆయన తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సెల్ఫీ తీసుకునేందుకు ముందుకు వచ్చిన ఓ యువకుడిపై ఆయన చెయ్యి చేసుకున్నారు. దీంతో ఆయన ప్రవర్తన అంతటా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.తన తదుపరి సినిమా షూట్‌లో భాగంగా ప్రస్తుతం వారణాసిలో పర్యటిస్తున్నారు నానా పటేకర్‌. వారణాసి వీధుల్లో షూటింగ్‌ జరుగుతోన్న సమయంలో అక్కడి వారందరూ ఆయన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదిలా ఉండగా.. ఆయన దగ్గరకు వెళ్లిన ఓ యువకుడు సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. యువకుడి తీరుతో అసహనానికి గురై అతడి తలపై ఆయన గట్టిగా కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.నానా పటేకర్‌ ప్రవర్తనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సెల్ఫీ ఇవ్వడం నచ్చకపోతే ఇవ్వను అని చెప్పాల్సింది. ఇలా అందరి ముందు కొట్టడం సరికాదు’, ‘ఇదే మాత్రం కరెక్ట్‌ కాదు. షూట్ మధ్యలో సెల్ఫీ తీసుకోవాలని అనుకోవడం ఆ యువకుడి తప్పు. అలాగే అతడిని కొట్టడం నటుడిది తప్పు’ అని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు. ‘దీక్ష’, ‘మోహ్రే’,  ‘అభయ్‌’, ‘గ్యాంగ్‌’, ‘భూత్‌’, ‘రాజ్‌నీతి’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’, ‘కాలా’.. తదితరచిత్రాలు పటేకర్‌కు గుర్తింపు తెచ్చాయి.

* దోడా ఘోర ప్రమాదం పై మోదీ దిగ్భ్రాంతి

జమ్ము కశ్మీర్‌లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. దోడా ప్రాంతంలో అస్సార్‌ వద్ద ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందగా.. 19 మందికి గాయాలైనట్లు సమాచారం.సహాయక చర్యలు ఇంకా కొనసాగుతుండగా.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. క్షతగాత్రుల్ని కిష్తావర్‌, దోడా సీఎంసీ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.బటోటే-కిష్తావర్‌ జాతీయ రహదారిపై బత్రుంగల్‌-అస్సార్‌ వద్ద బస్సు అదుపు తప్పి 300 అడుగుల లోతున పడిపోయిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జమ్ము డివిజనల్‌ కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ వెల్లడించారు. దోడా ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన ప్రధాని.. గాయపడ్డ వాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి  మృతుల కుటుంబాలకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు.​మరోవైపు ప్రమాద ఘటనపై కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారుల్ని ఆదేశించిన ఆయన.. అవసరమైతే హెలికాఫ్టర్‌ సేవల్ని వినియోగించాలని సూచించారు.

మెట్రో రైలులో మహిళ ముఠాను పోలీసులు అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీ నిత్యం బీజీగా ఉండే ప్రాంతం ..బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. షాపింగ్ మాల్స్.. ఇలా అన్ని ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. అలాంటి ప్రదేశాల్లో ఢిల్లీ రాజీవ్ చౌక్ రైల్వే స్టేషన్ ఒకటి.. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కొత్త విషయం ఏం కాదు .. అయితే ఏంటీ అంటారా.. ఇప్పుడు రాజీవ్ చౌక్ రైల్వే స్టేషన్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ఢిల్లీ పోలీసులు పోస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళితే.. రాజీవ్ చైక్ స్టేషన్ లో ముగ్గురు మహిళల ముఠా ఓ ప్రయాణికుడిని  దోచుకుంటున్న వీడియో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఇది ఆ వీడియోలో మహిళ తమ టార్గెట్ అయిన ప్రయాణికురాలిని చుట్టుముట్టి దోచుకుంటున్న దృశ్యాలను చూపిస్తోంది.ముగ్గురు పిక్ పాకెటర్లు ఓ ప్రయాణికురాలి బ్యాగ్ లోని వస్తువులను దొంగిలించేందుకు గుంపుగా చేరడం.. ఆ ప్రయాణికురాలిని ఒకామె టార్గెట్ గా గుంపు మధ్య దుపట్టాతో కప్పడం.. మరో ఇద్దరు ఆమెకు ఇరుపక్కల నిలబడటం.. రద్దీ ఉన్నట్లు టార్గెట్ చేసిన ప్రయాణికురాలిని నెట్టుకుంటూ వచ్చిన పని చేసుకొని అక్కడ నుంచి జారుకున్న తీరు ఈ వీడియోలో కనిపిస్తుంది.ఈ ఏడాది ప్రారంభం, ఆగస్టులో  ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణికులను పిక్ పాకెటింగ్ చేస్తున్న మహిళ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వారి కార్యకలాపాల నిర్వహణకు గురించి మీడియాకు వివరిస్తూ ఈ వీడియోను మీడియాకు చూపించారు. దీంతో ఈ వీడియో బయటకు వచ్చింది. దొంగతనానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. నిందితులను ఢిల్లీలో ఆనంద్ పర్బత్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

క్రూరత్వానికి ఉరి

అలువాలో ఐదేళ్ల చిన్నారిని అపహరించి, అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడు అష్వాక్‌ ఆలం(28)కు ఎర్నాకులం పోక్సో కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి, హత్యచేసిన కామాంధుడికి మరణ శిక్ష విధించింది కోర్టు. ముక్కపచ్చలారని చిన్నారి పట్ల నిందితుడు ప్రవర్తించి తీరు చాలా దారుణమని, హేయమైన చర్యగా కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారిపై అత్యాచారం తర్వాత బాలిక శవాన్ని గోనెసంచిలో కుక్కి చెత్త డంప్ లో పడవేయటం పట్ల కోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..జూలై 28న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భయంకరమైన సంఘటన జరిగింది. కొచ్చి సమీపంలోని అలువాలో అద్దెకు ఉంటున్న దంపతుల కూమార్తె ఐదైళ్ల చిన్నారి ఆడుకుంటూ కిడ్నాప్‌ అయ్యింది. ఆ చిన్నారికి స్వీట్లు, చాక్లెట్ల ఆశచూపించి ఎత్తుకెళ్లాడు నిందితుడు అష్వాక్‌ ఆలం. పీకల దాకా తాగిన మద్యం మత్తులో చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు. చిన్నారిపై కిరాతకంగా అత్యాచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి చంపేశాడు. మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళనపడ్డారు. ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీ టీవి ఫుటేజీలను పరిశీలించగా నిందితుడు అష్వాక్‌ ఆలం చిన్నారిని ఎత్తుకెళ్లినట్టుగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చిన్నారి ఆచూకీ తెలిసింది.స్థానిక మార్కెట్‌ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డులో గోనె సంచిలో కుక్కి పడేసిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టు మార్టంలో చిన్నారిపై జరిగిన దారుణం వెల్లడైంది. పసికందుపై అత్యాచారం జరిపి గొంతు నులిమి హత్య చేసినట్లుగా తేలింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేలుస్తూ.. మరణ శిక్ష విధించింది. బాలల దినోత్సవం (నవంబర్ 14) నాడు కోర్టు తీర్పు వెల్లడించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎన్ని చట్టాలు అమల్లోకి వచ్చినా, ఎంతమంది నిందితులకు మరణ శిక్షలు విధించిన కామాంధుల్లో మార్పు రావటం లేదు. ప్రపంచానికి తెలిసి కొన్ని సంఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఆలువా వంటి చిన్నారులు మరెందరో అభం శుభం తెలియని పసికందుల జీవితాలు చీకట్లోనే కనుమరుగై పోతున్నాయి. వారందరి ఆత్మలు గాల్లోనే మూగగా రోధిస్తున్నాయి..కామ పీశాచులు అంతమైన నాడు మాత్రమే ఈ భూమిపై ఆడపిల్ల హాయిగా ఆడుకునేది. జీవించేది.. అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే..!

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z