DailyDose

చంద్రబాబు పై జగన్ విమర్శలు- తాజా వార్తలు

చంద్రబాబు పై జగన్ విమర్శలు- తాజా వార్తలు

నేడు కృష్ణ తొలి వర్ధంతి

ఆంధ్రా జేమ్స్‌బాండ్‌, లెజెండరీ హీరో,  సూపర్‌ స్టార్‌ కృష్ణ ఈ లోకాన్ని వీడి ఏడాది గడిచిపోయింది. నేడు ఆయన తొలి వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఆయన వారసుడిగా ప్రిన్స్‌ మహేశ్‌ బాబు ఇండస్ట్రీలో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుని ఘట్టమనేని అనే పేరుకు గౌరవాన్ని తీసుకొచ్చారు. వారి కుటుంబంలో కృష్ణ గారి నుంచి మహేశ్‌, సితార,నమ్రత,గౌతమ్‌ అందరిలో ఒక పాయింట్‌ కామన్‌గా కనిపిస్తుంది. అదేమిటంటే..? ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం. పేదల భవిష్యత్‌ కోసం తమ వంతు సాయం చేయడం ఇవన్నీ ఘట్టమనేని కుటుంబంలో కనిపిస్తాయి.కృష్ణ  తొలి వర్ధంతి సందర్భంగా తాజాగా నమ్రత మరో  బృహత్కార్యాన్ని తలపెట్టారు.  పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు వారు ముందుకొచ్చారు. ఇప్పటికే ఘట్టమనేని వారి సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో పేదల కోసం ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇలాంటి లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు  మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో నిర్వహిస్తున్నారు. సుమారు 3వేలకు పైగా చిన్నారుల గుండెకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు పూనుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత ఇలా ప్రకటించారు.మామయ్య గారి వర్దంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశాం. ఇక నుంచి వారిని చదివించే బాధ్యతను ఎంబీ ఫౌండేషన్ తీసుకుంటుంది. వారు ఎంత వరకు చుదువుకున్నా.. అందుకు అయ్యే పూర్తి ఖర్చులు మేమే చూసుకుంటాం. ప్రస్తుతం నలుగురు విద్యార్థులను సెలక్ట్‌ చేశాం. ఈ కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం.’ నేడు నలుగురు విద్యార్థులు రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేం. మాకు చేతనైనంత వరకు పేద విద్యార్ధులను చదవించి వారి అందమైన భవిష్యత్‌కు దారి చూపించాలనేది మా లక్ష్యం.’ అని నమ్రత తెలిపారు. ఘట్టమనేని ఫ్యామిలీలో సాయం చేయడం, సాటి వ్యక్తిని ఆదుకోవడం ఈనాటిది కాదు. గతంలో తన సినిమాలతో నష్టపోయిన నిర్మాతలకు కృష్ణ  గారు మరో సినిమా ఛాన్స్‌ ఇచ్చేవారు. అందుకు ఎలాంటి రెమ్యునరేషన్‌ లేకుండా ఆయన నటించేవారు. ప్రస్తుతం ఆయన వారసుడు కూడా మరో అడుగు ముందుకేసి  సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే.. ఇండస్ట్రీలో కూడా ఎన్నో గొప్ప పనులు చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, డైరెక్టర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎందరినో ఆదుకున్నారు.తండ్రిని చూసి ఎన్నో మంచి గుణాలను మహేశ్ బాబు కూడా అలవరుచుకున్నారు. మహేశ్‌ను చూసి సితార,గౌతమ్‌ కూడా అదే దారిలో అడుగులు వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పేదలు, పేద పిల్లలను ఆదుకోవడంలో వారు ఎప్పుడూ ముందుంటారు.  అందులో భాగంగానే తాజాగా స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని నమ్రత ప్రకటించారు.

చంద్రబాబు పై జగన్ విమర్శలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రజల సంక్షేమం పట్టదని ఆరోపించారు. 14 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్న జగన్ .. ఎన్నికల సమయంలో మాయ మాటలతో ఓట్లడగడానికి వస్తాడన్నారు. చంద్రబాబు మానవత్వం లేని మనిషన్న ఆయన.. చంద్రబాబు ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

* శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం

తిరుచానూరులో జరుగుతున్న వార్షిక కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ మహిళా ఉద్యోగులతో కలిసి జేఈవో సదా భార్గవి శ్రీ పద్మావతి అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించారు. జేఈవో మాట్లాడుతూ ప్రతి ఏడాది అమ్మవారి బ్రహ్మోత్సవాలలో టీటీడీ మహిళా ఉద్యోగులు సారె అందించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారుల సతీమణులతో పాటు, ఆలయ సూపరింటెండెంట్ వాణి, టీటీడీ మహిళా ఉద్యోగుల ప్రతినిధి హేమలత, ఇతర మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

బాలుడ్ని దారుణంగా చంపిన కోతులు

చిన్న పిల్లలపై కుక్కలు దాడి చేసి చంపిన ఘటనలు చూశాం. అయితే గుజరాత్‌లో ఓ 10ఏళ్ల బాలుడిపై కోతులు అత్యంత దారుణంగా దాడి చేసి చంపాయి. బాలుడి కడుపును చీల్చి పేగులు బయటికి తీసి మరీ చంపేసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో సల్కి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దేగామ్‌ తాలూకాలోని ఓ గుడికి సమీపంలో బాలుడిపై కోతులు దాడి చేసినట్లు ఫారెస్ట్‌ అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దీపక్‌ ఠాకూర్‌ అనే బాలుడు స్నేహితులతో ఆడుకుంటుండగా కోతుల గుంపు ఒకటి అక్కడికి వచ్చి వారిని భయపెట్టింది.వెంటనే కోతులన్నీ కలిసి బాలుడిపై దూకాయి. అతడి ఒంటిపై చర్మాన్ని తొలగించి గోళ్లు పొట్ట లోపలికి దించి పేగులు బయటికి తీశాయి. దాడి తర్వాత వెంటనే దీపక్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలోనే డాక్టర్లు దీపక్‌ చనిపోయినట్లు ధృవీకరించారు.సల్కి గ్రామలో ఈ వారంలోనే కోతులదాడికి సంబంధించి ఇది మూడో ఘటన అని ఫారెస్ట్ అధికారులు చెప్పారు. అయితే ఆ రెండు ఘటనల్లో బాధితులను కాపాడినట్లు తెలిపారు. ఇక్కడ మనుఘులపై వరుసగా దాడులు చేస్తున్న కోతులను పట్టుకున్న వారికి వేల రూపాయల రివార్డులను కూడా అధికారులు ప్రకటిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ

మైనారిటీ ఓట్ల కోసం బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్‌పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ ఎప్పూడు ఒక్కటీ కాదని.. బీఆర్ఎస్ ఒక సెక్యూలర్ పార్టీ అని.. కేసీఆర్ సెక్యూలర్ లీడర్ అని అన్నారు. కాంగ్రెస్ ఆరోపిస్తున్నది నిజమైతే.. బీఆర్ఎస్‌కు గవర్నర్ సపోర్ట్ చేయాలి కదా అని ప్రశ్నించారు. కానీ బిల్లులను గవర్నర్ ఎందుకు తొక్కిపెడుతున్నారని.. ఆర్టీసీ బిల్లు లేట్ కావడానికి కారణం గవర్నరే అన్నారు. ఎమ్మెల్సీల తిరస్కరణ అంశాన్ని హరీష్ రావు ప్రస్తావించారు.

18 ఏళ్లు నిండిన మహిళలకు కూడా పెన్షన్

జగిత్యాల జిల్లాలో కథలాపూర్ లో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు బీడీ చుట్టే కార్మికులను పట్టించు కోలేదు.. కటాఫ్ తేదీ లేకుండా డిసెంబర్ 3 తర్వాత తప్పకుండా అర్హులైన అందరికీ పెన్షన్లు ఇస్తామన్నారు. మీకు రెండు ఛాన్స్ లు ఇచ్చాం కదా అని ఇంకో ఛాన్స్ ఇంకొకరికి ఇవ్వొదు..మీరు ఓడిపోతేనే తెలంగాణ గెలుస్తాంది.. మోడీ అల్లం, బెల్లం అన్నాడు మోచేతికి బెల్లం పెట్టాడు అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.18 ఏళ్లు నిండిన మహిళలకు కూడా పెన్షన్ ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం.. సీఎం కేసీఆర్ ను ఓడించేందుకు యోగి, బోగి, షేర్లు వస్తున్నారు.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు టికెట్లు, బీ- ఫాంలు ఢిల్లీలో ఇస్తారు ఇక్కడ కాదు అంటూ ఆయన మండిపడ్డారు. ఆడబిడ్డల ఉసురు పోసుకున్న ఏ పార్టీ బాగుపడదు.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తుల ఉమకు మంచి పదవి ఇప్పిస్తానని కేటీఆర్ మాట ఇచ్చారు.తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక సాగు, తాగు నీరు, కరెంటు సమస్యలపై నజర్ పెట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడోసారి అధికారంలోకి రాగానే హైదరాబాద్‌ అభివృద్దిపై దృష్టి పెట్టబోతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలంటే మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు

సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్కు షాక్

సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన సేవలు పార్టీ గుర్తుంచలేదనే మనస్తాపంతో కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తానని ప్రెస్ మీట్ లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఐదు సంవత్సరాలుగా కష్టపడ్డానని, అయితే.. సముచిత స్థానం దొరకలేదన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం చాలా పని చేశానని, బీసీలకు  పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదేళ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.నేషనల్ పేపర్స్ కు యాడ్స్ ఇచ్చిన విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులతో పాటు తనకు కూడా ఈడీ నోటీసులు అందాయన్నారు. ఇంత జరిగినా రాష్ట్ర నాయకత్వం తమను పలకరించలేదని వాపోయారు. అందుకే తీవ్ర మనస్తాపంతో కాంగ్రెస్ కు, పార్టీ పదవులకు రాజీనామ చేస్తున్నట్లు చెప్పారు. రాజీనామా లేఖను ఏఐసీసీ ఇన్ చార్జ్ ఖర్గేకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

భారీ వర్షాలకు తమిళనాడు అతలాకుతలం

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వానలు (Heavy Rains) పడుతున్నాయి. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు విరిగిపడుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.మరోవైపు ఈశాన్య రుతుపవనాలు (Northeast Monsoon) తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోని కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్‌, పుదుచ్చేరి (Puducherry)లోని కారైకల్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. అదేవిధంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు ఇప్పటికే సెలవు (schools closed) ప్రకటించారు. చెన్నైలోని పాఠశాలలు, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా పుదుచ్చేరిలో (Puducherry) కూడా స్కూళ్లు, కాలేజీలకు హాలీడే ఇచ్చారు.

 కేసీఆర్ కు భట్టి సవాల్

పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసి తిన్నటువంటి సొమ్మును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని, దోపిడి అరకడతామని అన్నారు. బీఆర్ఎస్ పరిపాలన నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు విముక్తి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని తెలిపారు. ఎర్రుపాలెం మండలం తెల్లపాలెం గ్రామంలో భట్టి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.తెల్లపాలెంలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రియంబర్స్మెంట్, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చారా? కరెంటు ఇచ్చారా? పది సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా బిఆర్ఎస్ పరిపాలన మారిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఐదు సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్న… కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎప్పుడైనా ప్రజల్లో కనిపించారా? అని ప్రశ్నించారు. దొరల తెలంగాణ వద్దు ప్రజల తెలంగాణ తెచ్చుకుందామన్నారు. ప్రజల సంపద ప్రజలకి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెల్ల పాలెం నుంచి జమలాపురం వరకు రోడ్డును వేయిస్తామని హామీ ఇచ్చారు.ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కానీ కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాష్ట్రం సంపదను పదికోక్కుల్లా దోచుకొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడానికి సిగ్గుండాలని తెలిపారు. ప్రజలపక్షాన పోరాడేందుకే రాష్ట్రలో తిరిగానని అన్నారు. సంపద కలిగిన రాష్ట్ర కనుక 6 గ్యారంటీలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అలోచన చేసే.. పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు తిరిగి అమలు చేస్తామన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రుపాలెం మండలంలో నిధులు పారించామన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం ఖాయమని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ తెలంగాణ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z