DailyDose

సైబర్ దొంగలు చాలా తెలివిగా మారారు-నేర వార్తలు

సైబర్ దొంగలు చాలా తెలివిగా మారారు-నేర వార్తలు

దేశంలో డీఫ్ ఫేక్‌లు సంచలనం 

దేశంలో డీఫ్ ఫేక్‌లు సంచలనం సృష్టిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలకు సంబంధిచిన డీఫ్ ఫేక్ వీడియోలు బయటకు రావడం కలకలం రేపింది. డీఫ్ ఫేక్ వీడియోల కారణంగా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారబోతున్నదన్న ఆందోళనను ఇటీవల పలువురు రాజకీయ నాయకులు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం డీఫ్ ఫేక్‌పై స్పందించారు. దీని బాధితులలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఉండటం చర్చనీయాశం అయింది. ఈ నేపథ్యంలో డీఫ్ ఫేక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. ఈనెల 24న అత్యన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నది. ఈ సమావేశంలో డీఫ్ ఫేక్‌పై కేంద్ర ఐటీ శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

నడిరోడ్డు పై ఓ యువతి అత్యంత దారుణంగా హత్య

అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ యువతి అత్యంత దారుణంగా హత్య(murder)కు గురైంది. కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు ఆమెను రోడ్డుపై పరిగెత్తించి, నరికి చంపారు. ఉత్తర్‌ ప్రదేశ్‌(Uttar Pradesh)లోని కౌశాంబి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..పవన్‌ నిషద్, అశోక్ నిషద్ కొద్దిరోజుల క్రితమే బెయిల్‌పై  జైలు నుంచి బయటకు వచ్చారు. పశువులు కాసుకొని ఇంటికి తిరిగివస్తోన్న 19 ఏళ్ల యువతిని నడిరోడ్డుపై వెంటాడి గొడ్డలితో నరికిచంపారు. ఆ సమయంలో అక్కడున్నవారంతా భయంతో వణికిపోయారని పోలీసులు తెలిపారు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ దారుణానికి కారణమని వెల్లడించారు. మూడేళ్ల క్రితం ఆ యువతిపై పవన్‌ అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన కేసులో అతడు జైలుకెళ్లాడు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని నిషద్ సోదరులు యువతి కుటుంబాన్ని వేధిస్తున్నారు. కానీ వారి బెదిరింపులకు బాధిత కుటుంబం లొంగలేదు. వేరే కేసులో జైల్లో ఉంటున్న అశోక్‌తో పాటు పవన్ కూడా ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు.అత్యాచార కేసు వెనక్కి తీసుకునే విషయంలో యువతి కుటుంబంతో వారికి మరోసారి ఘర్షణ జరిగింది. ఆ కుటుంబం అందుకు ససేమిరా అనడంతో నిందితులు ఆమెను చంపేందుకు ప్లాన్‌ చేశారు. పశువులు కాసుకొని ఇంటికి తిరిగివస్తున్న ఆమెను పరిగెత్తించి, గొడ్డలితో నరికిచంపేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం తరలించామని, నిందితులను అరెస్టు చేసేందుకు బృందాలను ఏర్పాటు చేశామని కౌశాంబి ఎస్పీ వెల్లడించారు.

* సైబర్ దొంగలు చాలా తెలివిగా మారారు

సైబర్ దొంగలు చాలా స్మార్ట్ అయ్యారు. ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న వ్యక్తికి అతని బ్యాంకు కు సంబంధించిన ఫేక్ మెసేజ్ పంపి బురిడీ కొట్టించారు. తీరా మోసాన్ని గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులను బ్యాంకు ఉద్యోగి ఆశ్రయించాడు. దీని బట్టి సైబర్ నేరగాళ్ళు ఆర్థిక నేరాలను చేయడం లో ఎంత రాటు తేలారో స్పష్టమవుతుంది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగికి మీరు మీ రిడీమ్ పాయింట్స్ ను క్లెయిమ్ చేయకపోతే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేస్తామని హెచ్చరిస్తూ… మీరు క్లెయిమ్ చేయాలనుకుంటే మేము పంపిన లింక్ లో వివరాలు పంపాలని మెసేజ్ లో బ్యాంకు సిబ్బందిగా వివరించారు.అదే బ్యాంకు లో పని చేస్తున్న ఉద్యోగి ఆ మెసేజ్ తన బ్యాంకు దేనని నమ్మి గుర్తు తెలియని వ్యక్తి పంపిన లింక్ లో వివరాలు నింపారు. అంతే ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగి క్రెడిట్ కార్డు నుంచి 60 వేలు కొట్టేశారు. మరుసటి రోజు అతని బ్యాంకు ఖాతా నుంచి మరో 50 వేలు కొట్టేశారు. ఇలా సైబర్ నేరగాళ్లు బాధితుడు పనిచేస్తున్న బ్యాంకుకు సంబంధించిన ఫేక్ మెసేజ్ పంపి మోసం చేయడం సంచలనం రేపుతోంది. బాధితుడు పరేషాన్ తో హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి ఓ యువతి మోసం

ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టింది. బాధితురాలు చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శిరీష మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ ప్రవీణ్‌ ఆరేళ్ల క్రితం ప్రేమ పేరుతో తన వెంట పడ్డాడన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడన్నారు.ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. కాగా యువతికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఉపాధ్యక్షురాలు షమీమ్‌బేగం గ్రామ మహిళలు మద్దతు తెలిపారు.

* పెట్రోల్‌ బంక్‌ వద్ద కిడ్నాపైన యువతి ఆచూకీ లభ్యం

బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పట్టపగలే అపహరణకు  గురైన యువతి ఆచూకీ లభించింది. సోమవారం ఉదయం గ్వాలియర్‌లోని ఓ పెట్రోల్‌ పంప్‌ వద్ద వేచి ఉన్న 19 ఏండ్ల యువతిని బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు బలవంతంగా ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు గుణాలోని ఓ లాడ్జిలో (Guna Lodge) ఆమెను కనుగొన్నారు. అనుమానితుల్లో ఒకరిని అరెస్టు చేశారు.సోమవారం ఉదయం ఓ యువతి తన బంధువులతో కలిసి గ్వాలియర్‌లోని నాకా చంద్రవద్ని పెట్రోల్‌ స్టేషన్‌ వద్ద బస్సు దిగారు. ఈ సమయంలో బైక్‌పై ఒక వ్యక్తి సిద్ధంగా ఉండగా.. మరో వ్యక్తి ఆ యువతిని ఈడ్చుకెళ్లి బైక్‌పై కూర్చోబెట్టాడు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తున్నా ఎవరూ కాపాడలేకపోయారు. వెంటనే ఆమె బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో గుణాలోని లాడ్జ్‌లో ఆమె ఆచూకీ లభించినట్లు గ్వాలియర్‌ ఎస్పీ రాజేశ్‌ సింగ్‌ ఛందాల్‌  చెప్పారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామన్నారు. మరొకరి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

* కెనరా బ్యాంక్‌లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని భవనంలో మంటలు చెలరేగాయి. సోమవారం సాయంత్రం భవనం మొదటి అంతస్తులో మంటలంటుకున్నాయి.. ఆకస్మికంగా జరిగిన ప్రమాదంతో గందరగోళం నెలకొంది. తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రజలు అద్దాలు పగులగొట్టి మెట్లపై నుంచి బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వాహనాలు హుటాహుటినా సహాయక చర్యలు ప్రారంభించాయి.సోమవారం సాయంత్రం హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని నావల్ కిషోర్ రోడ్డులోని కెనరా బ్యాంక్ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. నావెల్టీ సినిమా థియేటర్‌ వెనుక భాగంలో జరిగిన ఈ ప్రమాదంపై తీవ్ర దుమారం రేగింది. ఈ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొదటి అంతస్తులో దాదాపు 50 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇప్పుడు మంటలను అదుపు చేసి ప్రజలందరినీ సురక్షితంగా బయటకు తీశారు.అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని భవనంలో ఉన్న ఉద్యోగులందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన తర్వాత, బ్యాంక్ ఉద్యోగులు ఆఫీసు కిటికీల నుండి దూకేందుకు ప్రయత్నించడం, తప్పించుకోవడానికి భవనం పైకి పరుగులు తీయటం కనిపించింది. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పివేసి అందరినీ రక్షించినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.మొదటి అంతస్తులో మంటలు చెలరేగడానికి విద్యుత్‌ షార్ట్‌సర్క్యూటే కారణమని ఫైర్‌ సెఫ్టీ అధికారులు చెబుతున్నారు. భవనం నుంచి కిటికీలోంచి తప్పించుకున్న ఓ బ్యాంకు ఉద్యోగి ఎయిర్ కండీషనర్ మంటల్లో కాలిపోవటంతో దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల దాదాపు 50 మంది ఉన్నారు. కిటికీలు పగలగొట్టి బయటకు దూకేందుకు ప్రయత్నించటంతో పలువురు గాయపడినట్టుగా చెప్పారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z