DailyDose

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌-తాజా వార్తలు

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌-తాజా వార్తలు

* ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారాస ఓటమి చవిచూసింది. ఈనేపథ్యంలో కేసీఆర్‌ తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 64 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

బీజేపీకి మద్దతు తెలిపిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు మోదీ 

బీజేపీకి మద్దతు తెలిపిన తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుబంధం నిరంతరం పెరుగుతూ ఉంటుందని ఆశించారు. తెలంగాణ ప్రజలతో తమ అనుబంధం విడదీయరానిదని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పాటుపడతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రమించిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.తెలంగాణలో నేడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ విజయభేరి మోగించింది. బీజేపీ కూడా 8 స్థానాలను కైవసం చేసుకుంది. అటు.. అధికార బీఆర్‌ఎస్ పార్టీ 31 స్థానాల్లో విజయం సాధించింది. మరో 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

* తెలంగాణ డీజీపీ సస్పెండ్‌ చేసిన ఈసీ

 తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్‌ వేటు వేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీపీని సస్పెండ్‌ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదే అశంపై అదనపు డీజీలు సందీప్‌కుమార్‌ జైన్‌, మహేశ్‌భగవత్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో డీజీపీ అంజనీకుమార్‌, ఇద్దరు అదనపు డీజీలు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో డీజీపీ రేవంత్‌రెడ్డిని కలవడంతో ఈసీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

బీఆర్‌ఎస్‌ ఓటమిపై  స్పందించిన కవిత

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. బీఆర్‌ఎస్‌కు పరాభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో గెలిచే హ్యాట్రిక్‌ సాధిస్తామని ఆశించిన కేసీఆర్‌కు గట్టి షాకే తగిలింది. రెండు చోట్ల పోటీ చేసిన ఆయన కామారెడ్డిలో ఓటమి చెందారు.బీఆర్‌ఎస్‌ ఓటమిపై హరీష్‌రావు స్పందిస్తూ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీకి శుభాకాంక్షలు. రెండు సార్లు బీఆర్‌ఎస్‌కు అవకాశమిచ్చారని, ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ పార్టీని ఆదరించారని హరీష్‌రావు అన్నారు.బీఆర్‌ఎస్‌ ఓటమిపై కవిత కూడా స్పందించారు. అధికారం ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజల సేవకులమేనని, మనమంతా మన మాతృభూమి కోసం మనస్ఫూర్తిగా కృషి చేద్దామంటూ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆమె ట్వీట్‌ చేశారు.

*  మధ్యప్రదేశ్‌లో కమల ప్రభంజనం

మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో (Madhyapradesh Assembly Elections) భాజపా స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. మొత్తం 230 స్థానాలకుగానూ 157 స్థానాలకు పైగా కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారన్న దానిపై (Madhyapradesh CM) సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రచారంలో భాజపా అధిష్ఠానం జాతీయ స్థాయి నాయకుల్ని రంగంలోకి దించింది. ప్రధాని మోదీ, అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా కీలక నేతలంతా ప్రచారంతో హోరెత్తించారు. ఓట్ల కౌంటింగ్‌లో భాజపా విజయం సాధించడం దాదాపు ఖాయమైనా.. ముఖ్యమంత్రి పీఠంపై ప్రతిష్టంభన నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌తోపాటు, జ్యోతిరాదిత్య సింధియా, కైలాస్‌ విజయ్‌ వర్గీయ సీఏం పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.

బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైనా కవితకు సంతోషం కలిగించే విషయం 

 తెలంగాణ ‍ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైనా ఎమ్మెల్సీ కవితకు  మాత్రం సంతోషం కలిగించే విషయం ఒకటుంది. గత లోక్‌సభ  ఎన్నికల్లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో తననున పట్టుబట్టి ఓడించిన ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరుట్లలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ​ చేతిలో ఓటమి పాలయ్యారు.కోరుట్ల నియోజకవర్గం నుంచి సంజయ్‌ గెలుపులో ఎమ్మెల్సీ కవిత​ పాత్ర ప్రముఖంగా ఉంది. ఎంపీ అర్వింద్‌ ఏ పార్లమెంట్‌ నియోజకవర్గంలోనైతే తనను ఓడించి గెలిచాడో అదే పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అర్వింద్‌ను తన సపోర్ట్‌ ఉన్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓడించి కవిత రివేంజ్‌ తీర్చుకున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌లో అర్వింద్‌ను ఓడిస్తే కవిత  పగ పూర్తిగా తీరుతుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.ఇదే విషయమై కవిత ట్విట్టర్‌లో కూడా స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు  తెలిపారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల తరపున ఎల్లప్పుడూ పోరాడుతుందని తెలిపారు. మన మాతృభూమి కోసం చిత్తశుద్ధితో పనిచేద్దామని బీఆర్‌ఎస్‌ శ్రేణులకు సూచించారు.

కేటీఆర్‌’పై ప్ర‌శంస‌లు కురిపించిన రామ్ గోపాల్ వ‌ర్మ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections Results 2023) తమ పార్టీ ఓటమి దిశగా వెళ్లడంపై భారత్‌ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) స్పందించిన విష‌యం తెలిసిందే. ”భారత్‌ రాష్ట్ర సమితి (BRS)కి వరుసగా రెండుసార్లు అధికారాన్ని అందించినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈరోజు ఫలితం గురించి నేను బాధపడటం లేదు. కానీ.. అది మాకు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందాను. తాజా ఫలితాలను ఓ పాఠంగా తీసుకొని మళ్లీ అధికారంలోకి వస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీకి అభినందనలు అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే ఈ ట్విట్‌పై ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్పందిస్తూ.. నిజానికి ఇది చాలా మంచి ట్రెండ్‌ను సెట్ చేస్తుంది సర్ ఫ్యూచ‌ర్ కి. ఎందుకంటే ఓటమిని ఇంత సానుకులంగా తీసుకునే ఏ రాజకీయ నాయకుడిని నేను ఎప్పుడు చూడ‌లేదు. మీకు అభినందనలు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మీలాంటి వారు అవసరం అని వ‌ర్మ రాసుకోచ్చాడు. కాగా ప్ర‌స్తుతం ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z