Devotional

లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి 32.62 లక్షల ఆదాయం

లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి 32.62 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట (Yadagirigutta) లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ అధికారులు ఉత్వర ద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కుల ద్వారా, ఇతర ఆదాయాల ద్వారా ఆలయానికి రూ. 32,62,548 ఆదాయం (Income) వచ్చిందని ఆలయ అధికారులు వివరించారు.

ప్రధాన బుకింగ్‌ ద్వారా రూ. 29,200, సుప్రభాతం ద్వారా రూ. 9,400, బ్రేక్ దర్శనం ద్వారా రూ. 3,38,400 ఆదాయం సమకూరిందని తెలిపారు. వ్రతాలు నిర్వహించదం ద్వారా రూ. 2,17,600, వాహన పూజలు ద్వారా రూ. 13,000 , వీఐపీ (VIP) దర్శనం ద్వారా రూ. 3 లక్షలు, ప్రచారశాఖ ద్వారా రూ. 92,960, పాతగుట్ట ద్వారా రూ. 45,660, కొండపైకి వాహన ప్రవేశాల ద్వారా రూ. 4,50,000 ఆదాయం వచ్చిందన్నారు.

యాదఋషి నిలయం ద్వారా రూ. 1,12,520, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 98,400, శివాలయం ద్వారా రూ. 10,600, పుష్కరిణీ ద్వారా రూ. 3,000, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 13,22,100, కల్యాణ కట్ట ద్వారా రూ. 75,750 , లిజేస్ లీగల్ ద్వారా రూ. 78,180 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఇతరములు ద్వారా రూ.46,965, అన్నదానం ద్వారా రూ. 18,813 ఆదాయం ఆలయానికి వచ్చిందని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z