DailyDose

ఈ చేపని పట్టుకుంటే షాక్‌ కొడుతుందా!

ఈ చేపని పట్టుకుంటే షాక్‌ కొడుతుందా!

విశాఖలోని జూపార్కు తీరంలో మత్స్యకారుల వలకు శనివారం వెరైటీ చేపలు చిక్కాయి. అందులో ఒకటి తిమురు చేప. దీన్ని పట్టుకుంటే షాక్‌ కొడుతుందని మత్స్యకారులు తెలిపారు. ఆహార అన్వేషణలో భాగంగా సముద్రంలోని పెద్ద జీవుల బారి నుంచి రక్షించుకునే క్రమంలో ఈ చేప షాక్‌ కొట్టేలా కరెంటు ఉత్పత్తి చేస్తుందని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. అందుకే దీన్ని ‘ఎలక్ట్రిక్‌ రే’ అని పిలుస్తారన్నారు. దీని శాస్త్రీయ నామం ‘టర్ఫీడో మర్‌మరాటా’ అని చెప్పారు. మరోటి చేప ‘పప్పర్‌ ఫిష్‌’. స్థానిక మత్స్యకారులు ‘సముద్ర కప్ప’గా పిలుస్తారు. దీన్ని వల నుంచి బయటికి తీయగానే బెలూన్‌లా ఉబ్బింది. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇలా మారుతుందని శ్రీనివాసరావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z