Devotional

ఈ రాశివారికి గౌరవ మర్యాదలకు లోటుండదు-రాశిఫలాలు

ఈ రాశివారికి గౌరవ మర్యాదలకు లోటుండదు-రాశిఫలాలు

మేషం

వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు. తండ్రి తరఫు బంధువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. చేపట్టిన పనుల్లో ఆటం కాలు, అవరోధాలు తొలగిపోతాయి. సొంత నిర్ణయాలు, ఆలోచనలతో ఒకటి రెండు సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు దైవానుగ్రహంతో సజావుగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటు ఉండదు.

వృషభం

వృత్తి, వ్యాపారాలలో కొద్దిగా శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలో స్థాన చలన సూచనలున్నాయి. సహోద్యోగులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. నిరు ద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచించి అడుగువేయాలి. ఆర్థిక ప్రయత్నాలు కలసి వస్తాయి. ప్రారంభించిన పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయం సందర్శిస్తారు. అనవసర పరిచయాలతో ఇబ్బంది పడ తారు.

మిథునం

వృత్తి, వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. కొత్త వ్యూహాలపై దృష్టి పెడతారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం ఎక్కువవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. చేపట్టిన పనులలో విఘ్నాలు, ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

కర్కాటకం

రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిచిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు కలిసి వచ్చే కాలం ఇది. చిన్ననాటి స్నేహితు లతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఆస్తి వివాదం విషయంలో తోబుట్టువులతో రాజీ మార్గం అనుసరిస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా కొనసాగు తుంది. మీ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నవారు ముఖం చాటేస్తారు. వ్యాపారాలు పరవాలేదని పిస్తాయి. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య

వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యత లను అప్పగిస్తారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధువులతో విభేదాలు తలెత్త వచ్చు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా ధన లాభం పొందుతారు. తలపెట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు అంది వస్తాయి. మొండి బాకీలు వసూలు అవు తాయి.

తుల

ఆస్తుల కొనుగోలు వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా ఊపందుకుం టాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు సమర్థవం తంగా నిర్వర్తిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితుల సహాయ సహకారాలు అందు తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయ వద్దు.

వృశ్చికం

వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనుల్ని, వ్యవహారాల్ని నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవ హారాలు సంతృప్తి కలిగిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. రోజంతా ఉత్సాహంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యుల మీద బాగా ఖర్చు చేయడం జరుగుతుంది. ప్రముఖులతో పరిచ యాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు

రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. బంధువులతో సఖ్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రు లతో ఎంజాయ్ చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యో గులకు కలిసి వచ్చే సమయం ఉంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అయ్యే అవకాశం ఉంది. మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.

మకరం

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందక కొద్దిగా ఇబ్బంది పడ తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్ర త్తలు పాటించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు.

కుంభం

ఇంటా బయటా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. శ్రమ, తిప్పట వంటివి తప్పక పో వచ్చు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా ముందుకు సాగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణ యాలు తీసుకుంటారు. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీల జోలికిపోకపోవడం శ్రేయస్కరం. ప్రయా ణాలు కలిసి వస్తాయి కానీ, జాగ్రత్తగా ఉండడం మంచిది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం

వృత్తి, ఉద్యోగాలలో మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో స్నేహ సంబంధాలు మరింత పెరుగుతాయి. ఇతరులకు సహాయం చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త నిర్ణ యాలు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలావరకు చక్కబడు తుంది.

👉 – Please join our whatsapp channel here –

<https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z