Business

డీమార్ట్ క్యూ3 ఫలితాలు

డీమార్ట్ క్యూ3 ఫలితాలు

దేశవ్యాప్తంగా డీమార్ట్‌ (Dmart) పేరిట సూపర్‌ మార్కెట్లు నిర్వహించే అతిపెద్ద రిటైల్‌ చైన్‌ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.690.41 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.589.64 కోట్లతో పోలిస్తే లాభం 17 శాతం పెరిగింది.అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 17.31 శాతం పెరిగి రూ.13,572.47 కోట్లకు చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది ఇదే త్రైమాసికంలో అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ ఆదాయం రూ.11,569.05 కోట్లు. కంపెనీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా హరిశ్చంద్ర ఎం.భరుకాను నియమించినట్లు యాజమాన్యం తెలిపింది. మొత్తంగా 341 స్టోర్లు ఉన్నట్టు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ ఎన్‌సీఆర్‌, తమిళనాడు, పంజాబ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో డీమార్ట్‌ స్టోర్లు ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z