Devotional

తెలంగాణలోని రెండు ఆలయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

తెలంగాణలోని రెండు ఆలయాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

యాదాద్రి (Yadadri)శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంతో పాటు వర్గల్‌(Vargal) ఆలయానికి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. తొలిసారిగా తెలంగాణలోని రెండు ఆలయాలకు భోగ్‌ సర్టిఫికెట్‌(Bhog certificate ) రావడం విశేషం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్.ఎస్.స్.ఏ.ఐ) ప్రతి యేట జాతీయ సర్టిఫికెట్‌ ‘భోగ్’ (బ్లిస్ ఫుల్ హైజీన్ ఆఫరింగ్ టు గాడ్)ను అందిస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం దేశంలోని 70 దేవాలయాలు సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోగా తెలంగాణకు రెండు సర్టిఫికెట్లు రావడం ఇదే మొదటిసారి.

కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక ఆడిట్ బృందం(Audit Group), యాదాద్రి, వర్గల్ దేవాయాలు సందర్శించి ఆలయాల్లో నైవేద్యం, అన్నప్రసాదాల నాణ్యత, కిచెన్ నిర్వహణ, ఆహారం తయారు చేసే విధానం, శుచి, శుభ్రత అంశాలపై పరిశీలన చేసింది. ఫుడ్ సేఫ్టీ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకున్న కేంద్ర బృందం భోగ్ గుర్తింపునకు రిఫర్ చేసింది.

ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కమల వర్ధన్‌రావు శనివారం ఆలయ అధికారులకు భోగ్ సర్టిఫికెట్ ను అందజేశారు. అంతకుముందు ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ప్రత్యేక నోడల్ అధికారిణి, అడిషనల్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.సుమన్ కళ్యాణ్, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతి, అధికారులు ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z