Politics

నందిగామలో తెదేపా నేతలు నిరసన

నందిగామలో తెదేపా నేతలు నిరసన

కృష్ణా జిల్లా నందిగామ పోలీస్‌స్టేషన్‌ ఎదుట మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో తెదేపా నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇటీవల వైకాపా నిర్వహించిన సభలో తంగిరాల సౌమ్యపై అనుచిత వీడియోలను ప్రదర్శించారు. దీనికి కారణమైన వైకాపా నేతలు కరీముల్లా, షేక్‌ యాకుబ్‌ అలీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు రోజుల క్రితం ఆమె ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ తెదేపా నేతలు పీఎస్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సీఎం జగన్‌, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను అరెస్ట్‌ చేయకపోతే ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావుపై నందిగామ రూరల్‌ సీఐ నాగేంద్రకుమార్ దుర్భాషలాడారు. దీనిపై తంగిరాల సౌమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా తెదేపా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. న్యాయం చేయాలని వస్తే ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పీఎస్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z