నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్ కేర్ డిజిటలీకరణ’ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ ప్రసంగించారు. ‘‘అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని. అయితే నాణ్యమైన వైద్యసేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రజలందరికీ ఉత్తమ వైద్యసేవలు అందించాలనేదే నా లక్ష్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతాం. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33 శాతం హైదరాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి’’ అని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
👉 – Please join our whatsapp channel here –