Health

‘యాంటీబయాటిక్స్’పై కేంద్రం కీలక ప్రకటన

‘యాంటీబయాటిక్స్’పై కేంద్రం కీలక ప్రకటన

అనారోగ్య బాధితులకు యాంటీబయాటిక్‌ ఔషధాలను సిఫార్సు చేసేటప్పుడు.. అందుకు కారణాలను మందుల చీటీలో తప్పనిసరిగా తెలియజేయాలని వైద్యులను కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. అర్హులైన డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే యాంటీబయాటిక్‌లను విక్రయించాలని ఫార్మసిస్టులకు విజ్ఞప్తి చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టర్‌ జనరల్‌ (డీజీహెచ్‌ఎస్‌) డాక్టర్‌ అతుల్‌ గోయెల్‌ ఈ మేరకు దేశవ్యాప్తంగా అన్ని వైద్యసంఘాలకు, ఫార్మసిస్టు సంఘాలకు తాజాగా లేఖ రాశారు. యాంటీబయాటిక్‌ ఔషధాల వినియోగం అధికమైతే రోగుల్లో నిరోధకత పెరిగి భవిష్యత్తులో తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతుంటాయి. ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నేరుగా యాంటీబయాటిక్‌ ఔషధాలను విక్రయించకూడదని ఫార్మసిస్టులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z