Devotional

దిన ఫలాలు – జనవరి 19 2024

దిన ఫలాలు – జనవరి 19 2024

మేషం

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు కొత్త పుంతలు తొక్కు తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు లాభాలను తీసుకు వస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతి చెందు తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు.

వృషభం

అన్ని విధాలుగానూ ఆశించిన పురోగతి ఉంటుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కొద్దిగా కోలుకునే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కొద్ది శ్రమతో విద్యార్థులు బాగా రాణిస్తారు.

మిథునం

ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆశించిన లాభాలతో పుంజుకుంటారు. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగుతుంది కానీ, అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. ఉద్యోగ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. విద్యార్థులు పురోగతి సాధి స్తారు.

కర్కాటకం

రోజంతా దాదాపు సానుకూలంగా గడిచిపోతుంది కానీ, కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. పై అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణి వృత్తి, ఉద్యోగాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది.

సింహం

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సకాలంలోకొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. పిల్లల చదువుల విషయంలో శుభ వార్తలు అందుకుంటారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. రావలసిన డబ్బు సకా లంలో చేతికి అందుతుంది. విద్యార్థులకు సమయం బాగుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు.

కన్య

ఆర్థిక వ్యవహారాలు విజయవంతంగా పూర్త వుతాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయో జనాలుంటాయి. తలపెట్టిన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులు సహాయం అందజేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో భారీ లక్ష్యాలు ఉండే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు.

తుల

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుం టాయి. విదేశాలలో స్థిరపడిన పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి.

వృశ్చికం

కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు.చిన్ననాటి మిత్రుల నుంచి సహకారం లభి స్తుంది. ప్రధానమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ జీవితంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారా లలో అసంతృప్తి తలెత్తుతుంది. అనుకోని ఖర్చులు భరించాల్సి వస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఆర్థిక లావా దేవీలు, స్పెక్యులేషన్ వంటివి ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. ఉద్యోగాల్లో మంచి అవకాశాలు అందివస్తాయి. నిరుద్యోగులకు కూడా ఆఫర్లు అందు తాయి. సమాజంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు సమయం అనుకూ లంగా ఉంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన దేవాలయాలను సందర్శిస్తారు.

మకరం

రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఎటువంటి ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారంలో బాగా బిజీ అవుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కొద్దిగా ఇబ్బందులుంటాయి. కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. రాదనుకుని వది లేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలు అవుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం

రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోయే అవకాశం ఉంది. ఆర్థికంగా కొద్దిపాటి పురోగతి సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు పని చేస్తాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది.

మీనం

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అనుకోకుండా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సమాజంలో పలుకు బడి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో మీ ఆలోచనలు, ప్రయత్నాలు లాభాలను తీసుకు వస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ లాభిస్తాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z