Business

సరికొత్త నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్ఓ

సరికొత్త నిర్ణయం తీసుకున్న ఈపీఎఫ్ఓ

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డుని పరిగణించబోమని తెలిసింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధ్రువీకరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఈపీఎఫ్ఓ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన సర్క్యులర్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ఖాతాదారులు తప్పకుండా గమనించాలి. ఇప్పటికే పలు న్యాయస్థానాల్లో ఆధార్ కార్డుని జనన ధ్రువీకరణ పత్రంగా పరిగణించబోమని ప్రకటించడంతో.. ఈపీఎఫ్ఓ సంస్థ కూడా ఇదే బాటలో అడుగులు వేస్తూ ఎట్టకేలకు ధ్రువీవీకరించింది.

EPFO కోసం పుట్టిన తేదీకి రుజువుగా చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్

ఏదైనా గుర్తింపు పొందిన ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీ జారీ చేసిన మార్క్‌షీట్

స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (SLC)

స్కూల్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)

SSC సర్టిఫికేట్ (పేరు, పుట్టిన తేదీ ఉంటుంది)

పాన్ కార్డ్

కేంద్ర/రాష్ట్ర పెన్షన్ పేమెంట్ ఆర్డర్

ప్రభుత్వం జారీ చేసిన డొమిసైల్ సర్టిఫికేట్

పాస్‌పోర్ట్

ప్రభుత్వ పెన్షన్ ఐడీ

సివిల్ సర్జన్ జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్

పైన తెలిపిన డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓలో పుట్టిన తేదీ కరెక్షన్ కోసం సమర్పించవచ్చు. వీటిలో పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు మ్యాచ్ అయ్యేలా ఉండాలి. అయితే ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే. కాబట్టి దీనిని పుట్టిన తేదీ నిర్దారణ కోసం పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z