DailyDose

SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు

SSC బోర్డు పేరుతో నకిలీ వెబ్‌సైట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వీటితో అసలైన బోర్డు వెబ్‌సైట్‌కు ఇబ్బందులు ఉన్నాయని వెంటనే వీటిని తొలగించాలంటూ SSC బోర్డు అధికారులు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షలను ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించేందుకు SSC బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. రెండు నకిలీ వెబ్‌సైట్లని బోర్డు సిబ్బంది గుర్తించి అధికారులకు తెలిపారు. నకిలీ వెబ్‌సైట్లను వెంటనే తొలగించాలని నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ విభాగం డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z