DailyDose

గ్యాస్‌ సరఫరా చేసే ఓ యువకుడుకు వరించిన అదృష్టం

గ్యాస్‌ సరఫరా చేసే ఓ యువకుడుకు వరించిన అదృష్టం

ఇంటింటికి గ్యాస్‌ సరఫరా చేసే ఓ యువకుడు ఫాంటసీ క్రికెట్‌ గేమ్‌లో జాక్‌పాట్‌ కొట్టాడు. డ్రీమ్‌-11 యాప్‌లో గేమ్‌ ఆడిన అతడు ఏకంగా రూ.కోటిన్నర కైవసం చేసుకున్నాడు. బిహార్‌లోని అరారియా జిల్లా పటేగనా గ్రామానికి చెందిన సాదిఖ్‌ స్థానికంగా ఓ ఏజెన్సీలో గ్యాస్‌ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌పై ఆసక్తి ఉన్న సాదిఖ్‌ ఈ నెల 14న జరిగిన భారత్‌-అఫ్గానిస్థాన్‌ టీ20 మ్యాచ్‌ సందర్భంగా రూ.49 పెట్టి డ్రీమ్‌-11లో గేమ్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 974.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి రూ.కోటిన్నర గెలుచుకున్నాడు. ప్రస్తుతం సాదిఖ్‌ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మరోవైపు, ఈ విషయంపై గ్యాస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జితేంద్ర స్పందిస్తూ.. సాదిఖ్‌ బ్యాంకు ఖాతాకు డబ్బులు వచ్చిన వెంటనే వాటిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z