DailyDose

అనంతపురం యువతిపై పోలీసు దాష్టీకం-నేరవార్తలు

అనంతపురం యువతిపై పోలీసు దాష్టీకం-నేరవార్తలు

* పోలీసు లైబ్రరీలో చదువుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకున్న ఆర్‌ఎస్‌ఐ ఉదంతం ఆదివారం వెలుగుచూసింది. అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు… అనంతపురంలోని మారుతీనగర్‌కు చెందిన ఓ యువతి ఉద్యోగాల అన్వేషణలో భాగంగా పోలీసు లైబ్రరీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఈ క్రమంలో అక్కడున్న ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలతో లోబర్చుకుని పెళ్లి పేరుతో శారీరక అవసరాలు తీర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ఊసెత్తగానే మొహం చాటేశాడు. పలుమార్లు ఆమె ప్రాధేయపడినా వినలేదు. చివరకు విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పంచాయితీ నిర్వహించి తన గుట్టును రట్టు చేయడంతో ఆగ్రహించిన ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ బాధితురాలిని హతమారుస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోన్‌ సంభాషణ దాచుకున్న ఆమె ఆదివారం నేరుగా నాల్గో పట్టణ పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. యువతిని మోసం చేసిన ఆర్‌ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్ ను బదిలీ చేసిన ఎస్పీ అన్భురాజన్, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు iccaaru.

* మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి పెళ్లి పేరుతో మహిళను మోసం చేశాడు. (cheating woman) ఆమె నుంచి డబ్బు, బంగారం తీసుకుని పరారయ్యాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చివరకు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 36 ఏళ్ల సిబిచక్రవర్తి మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా తిరువిడైమరుధూర్‌కు చెందిన వితంతు మహిళకు పరిచయం అయ్యాడు. ఇంజినీర్‌గా పేర్కొన్న అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మహిళ నుంచి రూ.3 లక్షల డబ్బు, 120 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయాడు. కాగా, మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత మహిళ గత ఏడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చివరకు నిందితుడైన సిబిచక్రవర్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేవలం 12వ తరగతి మాత్రమే చదివిన అతడు మ్యాట్రిమోనియల్ సైట్‌ ద్వారా వితంతు, ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుసుకున్నారు. సుమారు 80 మంది వేర్వేరు మహిళలతో కలిసి దిగిన ఫొటోలను అతడి మొబైల్‌ ఫోన్‌లో గుర్తించారు. నిందితుడు సిబిచక్రవర్తిపై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీస్‌ అధికారి వెల్లడించారు.

* జాతీ­య రహదారిపై వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న రూ.2,07,50,000 నగదును పోలీసు­లు పట్టుకున్నారు. ఎస్‌ఐ విభీషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉన్నతాధికారుల ఆదేశాల మేర­కు శనివారం రాత్రి వేంపాడు టోల్‌ప్లాజా వద్ద వా­హ­నాల తనిఖీ చేపట్టామని, తుని నుంచి విశాఖ వె­ళ్తు­న్న ఒక కారును ఆపి చూడగా లోపల ఐదు బ్యా­గుల్లో రెండుకోట్ల ఏడు లక్షల యాభైవేలరూపాయల నగదు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన వజ్రపు వెంకటేశ్వరరావు,యాదవరాజు కారులో ఈ నగదు తీసుకెళ్తున్నట్లుతెలిపారు. తాము ధాన్యం వ్యాపారం చేస్తున్నట్లు వీ­రు చెప్పారని, ఈ నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించలేదన్నారు. నగదుతోపాటు, కారును కూడా సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z