ScienceAndTech

తెగిన Oxford University-TCS బంధం

తెగిన Oxford University-TCS బంధం

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ యూనివర్సిటీ ‘ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ’.. టీసీఎస్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సంస్థలో అడ్మిషన్ కోసం నిర్వహించే ఆన్ లైన్ పరీక్షల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘ఈ ఏడాది ఆన్ లైన్ అడ్మిషన్ టెస్ట్‌ల నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని కొందరు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఆక్స్‌ఫర్డ్ నిర్వహించే ఈ ఆన్ లైన్ పరీక్షల నిర్వహణ ముందుకు సాగేందుకు టీసీఎస్ భాగస్వామి కాలేదు’ అని యూనివర్సిటీ అధికార ప్రతినిధి శుక్రవారం తెలిపారు.

ప్రతి ఏటా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచవ్యాప్తంగా అడ్మిషన్ల కోసం వేల మంది అభ్యర్థులు అడ్మిషన్ టెస్ట్ రాస్తుంటారు. బ్రిటన్ పొడవునా గల 30 కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఆఫర్ చేస్తున్నది. భారత్ మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ లతోపాటు పలువురు భారతీయ ప్రముఖులు యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. 2023 ఏప్రిల్‌లో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ.. ఆన్ లైన్ అడ్మిషన్ పరీక్ష నిర్వహణ, లెర్నింగ్ అసెస్ మెంట్ ఫోకస్ యూనిట్‌గా టీసీఎస్ ఐయాన్’ను ఎంపిక చేశాం’ అని యూనివర్సిటీ అధికార ప్రతినిధి తెలిపారు.

‘ఈ ఏడాది కాలంలో అభ్యర్థులు తమకు ఎదురైన సాంకేతిక ఇబ్బందులపై చేసిన ఫిర్యాదులు, వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా టీసీఎస్ తో ఒప్పందం రద్దు చేసుకున్నట్లు నిర్ణయించాం. ఈ అడ్మిషన్ టెస్ట్‌ల నిర్వహణలో సహనంతో వ్యవహరించిన మా ఉపాధ్యాయుల టీం, విద్యార్థులకు ధన్యవాదాలు. తదుపరి ఆన్ లైన్ అడ్మిషన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లపై త్వరలో తెలియజేస్తాం’ అని ఆక్స్ ఫర్డ్ తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z