Business

హీరో మోటార్స్ నుండి స్కూటర్ కం ఆటోరిక్షా-వాణిజ్యవార్తలు

హీరో మోటార్స్ నుండి స్కూటర్ కం ఆటోరిక్షా-వాణిజ్యవార్తలు

* ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన భవిష్యత్ ప్రణాళికలను బయట పెట్టారు. మిగతా తన జీవితం తన పిల్లలు, మనుమలతో గడిపేందుకు, సంగీతం వినేందుకు, ఫిజిక్స్ నుంచి ఎకనామిక్స్ వరకూ విభిన్న రకాల పుస్తకాలు చదివరేందుకు ప్లాన్ చేసుకున్నానని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. రాజకీయాల్లోకి చేరేందుకు తనకు ఎటువంటి ప్రణాళికల్లేవని కుండబద్ధలు కొట్టారు.‘రాజకీయాల్లోకి రావాలంటే నేను వ్రుద్ధుడ్ని. నాకు ఇప్పుడు 78 ఏండ్లు’ అని రాజకీయాల్లో వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రచయిత-దాత నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సైతం ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లో చేరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.

* ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆ సంస్థ కో-పౌండర్ బిన్నీ బన్సల్ వైదొలిగారు. ఇటీవల తాను సొంతంగా ‘ఓప్ డోర్’ అనే పేరుతో ఈ-కామర్స్ వెంచర్ బిజినెస్ ప్రారంభించిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్‌ బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.బిన్నీ బన్సల్ రాజీనామాను ఫ్లిప్‌కార్ట్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.

* వ్యాపార అవసరాలకు ఆటో రిక్షా.. వ్యక్తిగత అవసరాల కోసం ప్రయాణించాలంటే టూ వీలర్‌గా పని చేసే టూ ఇన్ వన్ వాహనం రూపుదిద్దుకున్నది. విద్యుత్ వినియోగ స్కూటర్’ను కేవలం మూడు నిమిషాల్లో ఆటో రిక్షాగా మార్చుకునే కొత్త వెహికల్‌ను హీరో మోటో కార్ప్ ఇటీవల నిర్వహించిన ‘హీరో వరల్డ్ ఈవెంట్’లో ఈ స్కూటర్ ట్రక్కును ప్రదర్శించారు. సర్జ్ 32 పేరుతో ఆవిష్కరించిన స్కూటర్ కం ఆటో రిక్షాను స్వయం ఉపాధితో జీవించే వారి అవసరాల కోసం దీన్ని రూపొందించామని హీరో మోటో కార్ప్ పేర్కొంది. మామూలు ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీవీలర్ ఆటో రిక్షాలో విండ్ స్క్రీన్, హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్, విండ్ స్క్రీన్ వైఫర్లు ఉంటాయి. ఆటోకు డోర్లు లేకున్నా జిప్‌తో కూడిన సాఫ్ట్ డోర్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ టూ ఇన్ త్రీ వెహికల్స్‌లో వేర్వేరుగా కెపాసిటీ నిర్ణయించింది హీరో మోటో కార్ప్. త్రీ వీలర్- ఆటో రిక్షాలో 10 కిలోవాట్ల ఇంజిన్, 11 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఫీచర్ జత చేశారు. ఇక స్కూటర్ లో 3కిలోవాట్ల ఇంజిన్ ఉంటే 3.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ జత చేశారు. 50 కి.మీ గరిష్ట వేగంతో ప్రయాణించే త్రీవీలర్ 500 కిలోల బరువు రవాణా చేయగలదు. టూ వీలర్ వెహికల్ మాత్రం గరిష్టంగా 60 కి.మీ వేగంతో దూసుకెళుతుంది. దీనికి సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’లో పోస్ట్ చేశారు. ఈ టూ ఇన్ త్రీ వీలర్ కన్వర్టబుల్ వెహికల్ ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు.

* తెలియని ప్రదేశంలో గుడి, పార్క్‌, రెస్టారెంట్.. ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా రూట్‌ మ్యాప్స్‌ పైనే ఆధారపడతాం. అవి తెరుచుకునే సమయం, రూట్‌, క్లోజింగ్ టైమ్‌ వంటి వాటి కోసం మ్యాప్స్‌నే ఆశ్రయిస్తాం. ఫుడ్‌, షాపింగ్‌ కోసమైతే రివ్యూలూ చూస్తాం. అదే మ్యాప్స్‌లో ఏదైనా దుకాణం మూసివేశారని చూపిస్తే అటుగా వెళ్లడం మానేస్తాం. కానీ, యాపిల్ మ్యాప్స్‌ తప్పుగా చూపించడంతో ఏళ్లుగా నడుస్తున్న ఓ రెస్టారెంట్‌కు పెద్దఎత్తున నష్టాలు వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్‌ ప్యాట్‌ తన భార్య పమ్‌తో కలిసి పమ్స్‌ కిచెన్‌ అనే థాయ్‌ రెస్టారెంట్‌ను స్థాపించారు. కొంతకాలం బాగానే నడిచినప్పటికీ.. క్రమంగా కస్టమర్ల రాక తగ్గింది. యాపిల్‌ మ్యాప్స్‌ దీనికి కారణమని వారు గుర్తించారు. ‘‘10 ఏళ్లుగా నా భార్యతో కలసి రెస్టారెంట్‌ నడుపుతున్నాం. ఎంతో బాగా నడుస్తున్న రెస్టారెంట్‌కు కొన్నాళ్లుగా కస్టమర్లు రావడం తగ్గించేశారు. అకస్మాత్తుగా ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాలేదు. ఓ రోజు ‘ఎందుకు ఈ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నారు’ అంటూ ఓ రెగ్యులర్‌ కస్టమర్‌ కాల్‌ చేసి ప్రశ్నించాక అసలు విషయం తెలిసింది. యాపిల్‌ మ్యాప్స్‌లో రెస్టారెంట్‌ శాశ్వతంగా మూసేసినట్లు చూపిస్తోందని అప్పుడు మాకు అర్థమైంది. మా ఇద్దరి వద్ద యాపిల్‌ డివైజ్‌లు లేవు కాబట్టి ఈ విషయం మాకు ఆలస్యంగా తెలిసింది’’ అని ప్యాట్‌ తెలిపారు.

* ప్రస్తుతం సురక్షితమైన ఎలక్ట్రిక్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎలక్ట్రిక్‌ కారు కొనుగోలు చేసేవారికి నాలుగు ప్రధానమైన బ్యాంకులు ప్రత్యేక వడ్డీ రేట్లతో రుణాలందిస్తున్నాయి. ఎస్‌బీఐ ఎలక్ట్రిక్‌ కార్ల కోసం తగ్గింపు రేట్లతో రుణాన్ని అందజేస్తోంది. ఎస్‌బీఐలో రుణం తీసుకుని కొనుగోలు చేసే కస్టమర్లకు బ్యాంకు 20 బేసిస్‌ పాయింట్ల వడ్డీ రేటును తగ్గిస్తోంది. జనవరి 31 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు కూడా లేదు. ప్రస్తుత వడ్డీ రేటు 8.75% నుంచి 9.45% వరకు ఉంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఆధారంగా 9.15-12.25% వరకు వడ్డీ రేటును వసూలు చేస్తోంది. .ముందస్తు చెల్లింపులపై జరిమానాను కూడా వసూలుచేయడం లేదు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z