WorldWonders

లక్ష కోట్ల మోసం చేసిన మహిళ-నేరవార్తలు

లక్ష కోట్ల మోసం చేసిన మహిళ-నేరవార్తలు

* ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడు తండ్రి నడిపే ఆటో ఢీకొని మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఆటో నడుపుతూ జీవనం సాగించే వరిగంజి మురళీకృష్ణకు కుమారుడు రిషిక్‌(4) ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఆటోను వెనక్కు మళ్లించే క్రమంలో.. అక్కడే ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా వెనక్కి రావడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతికి కారణమయ్యానని తండ్రి విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

* యత్నాం (విఎత్నం)లో వందల కోట్ల డాలర్ల మోసం (Fరౌద్) బయటపడింది. రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌గా పేరొందిన ఓ మహిళ ఏకంగా 12.5 బిలియన్‌ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.లక్ష కోట్లకు పైమాటే) మేర ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో వేలాదిమంది బాధితులు లబోదిబోమంటున్నారు. వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ వాన్‌ తిన్హ్‌ పాట్‌ అనే కంపెనీ ఛైర్‌పర్సన్‌ ట్రుయాంగ్‌ మైలాన్‌కు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (శ్ఛ్భ్)లో దాదాపు 90శాతం వాటా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడ్డారు. నకిలీ లోన్‌ అప్లికేషన్లు పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. 2018 నుంచి 2022 మధ్య లాన్‌.. ఇలా 916 నకిలీ దరఖాస్తులు సృష్టించి బ్యాంకు నుంచి 304 ట్రిలియన్‌ డాంగ్‌ (వియత్నాం కరెన్సీ)లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంటే 12.5 బిలియన్‌ డాలర్లకు పైమాటే. 2019-22 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌క్వార్టర్స్‌ నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును లాన్‌ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో కుంభకోణం బయటపడగా ఆ ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నాటి నుంచి బ్యాంకు బాండ్‌ హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బులు విత్‌డ్రా చేసుకోలేకపోవడంతో పాటు కనీసం వడ్డీ కూడా అందుకోవట్లేదు. దీంతో వందలాది మంది బాధితులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌తో పాటు 85 మందిపై కేసు నమోదైంది. ఇందులో బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉన్నారట.

* ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్న భారీ సొరంగాలను పోలీసులు గుర్తించారు. ఒక మనిషి నడిచి వెళ్లేంత వెడల్పుతో అక్కడక్కడ గాలి, వెలుతురు వచ్చేలా వీటిని నిర్మించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఈ సొరంగాల నుంచి వచ్చిన మావోయిస్టులు మంగళవారం బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

* ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం ఆశపడిన ఓ వ్యక్తి చనిపోయినట్లుగా ఆడిన డ్రామా బెడిసికొట్టింది. శ్మశానం నుంచి ఓ శవాన్ని తీసుకొచ్చి కాల్చేసి తానే చనిపోయానని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. దృశ్యం సినిమా రేంజ్‌లో ప్లాన్‌ చేసినప్పటికీ.. భార్య కారణంగా సీన్‌ బెడిసికొట్టి పోలీసుల దగ్గర అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాతవీరంపాలెం గ్రామానికి చెందిన ధాన్యం వ్యాపారి కేతమళ్ల వేంకటేశ్వరరావు (పూసయ్య ) అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. రోజురోజుకీ అప్పులు, వడ్డీలు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థంకాక ఓ ప్లాన్‌ వేశాడు. తాను చనిపోతే రూ.40 లక్షల ఇన్సూరెన్స్‌ వస్తుందని భావించిన పూసయ్య.. ప్రమాదవశాత్తూ తాను మరణించినట్లు నమ్మించాలని అనుకున్నాడు. ఇందుకోసం రాజమహేంద్రవరం గ్రామీణం మోరంపూడికి చెందిన ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శ్మశానం నుంచి ఒక మృతదేహాన్ని తీసుకొచ్చి తానే చనిపోయానని నమ్మించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25వ తేదీన మృతదేహాన్ని తీసుకొచ్చి.. వీరంపాలెంలోని ఓ పొలం దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. చనిపోయింది పూసయ్యే అని నమ్మించేందుకు అతని చెప్పులు, సెల్‌ఫోన్‌ అక్కడే పడేసి వెళ్లిపోయారు. జీడిమామిడి తోటలో పూర్తిగా కాలిపోయిన మృతదేహం దగ్గర లభించిన సెల్‌ఫోన్‌, మోటార్‌సైకిల్‌ ఆధారంగా చనిపోయింది పూసయ్యే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. పోస్టుమార్టం అనంతరం తన కుటుంబానికి అప్పగించారు.

* కుటుంబ కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ఓ చిన్నారి మృతిచెందడం గ్రామంలో విషాదం నింపింది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం శ్రీకాకుళం (శ్రికకులం) జిల్లాలోని రణస్థలం మండలం బీర్‌పల్లి గ్రామంలో తల్లి లక్ష్మీ , కుమార్తె సంధ్య, మనుమడు రాజు, మనువరాలు భవ్యశ్రీ నివసిస్తున్నారు. వీరిమధ్య తరుచూ గొడవలు జరుగుతుండడంతో భరించలేక నలుగురు పురుగుల (ఫెస్తిచిదెస్) మందు తాగారు. గమనించిన స్థానికులు నలుగురిని హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించగా 10 ఏండ్ల భవ్యశ్రీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది. మిగత నలుగురు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

* ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి ప్రస్తుతం చంచ‌ల్‌గూడ(ఛంచల్గుద ) జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాల‌కృష్ణ(షివ బలక్రిష్న)ను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమ‌తించింది. ఎనిమిది రోజుల పాటు శివ బాల‌కృష్ణ ఏసీబీ క‌స్టడీలో ఉండ‌నున్నారు. ఈ మేరకు బుధవారం శివ బాలకృష్ణను అధికారులు చంచల్‌గూడ జైలు నుంచి బంజారాహిల్స్‌ ఏసీబీ కార్యాలయానికి (ఆఛ్భ్ ఒఫ్ఫిచె) తరలించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z