క్యూబా దేశం.. పేదరికం, ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో కొట్టుమిట్టాడుతోంది. కనీస అవసరాలను తీర్చుకోలేని స్థితిలో అక్కడి ప్రజల బతుకులు మగ్గుతున్నాయి. అలాంటి క్యూ దేశ రాజధాని హవానాలో ఈ భారీ దొంగతనం జరిగిందని అక్కడి అధికారులు తెలిపారు. ఈ 133 టన్నుల చికెన్‌ని విక్రయించి.. వచ్చిన డబ్బులతో ఆ దొంగలు ల్యాప్‌టాప్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తులను కొనుగోలు చేశారు. ఈ కేసులో 30 మందిపై అభియోగాలు మోపారు. హవానాలోని స్టేట్ ఫెసిలిటీలో ఉన్న 1660 వైట్ బాక్సుల నుంచి ఈ మాంసాన్ని తీసుకెళ్లారు. ఆ దేశంలో ఆహార కొరత ఉంది కాబట్టి.. రేషన్ ప్రకారం చికెన్‌ని అక్కడి ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఈ 133 టన్నుల చికెన్‌ని కూడా ప్రజలకు పంచేందుకు సిద్ధం చేసి ఉంచారు. కానీ.. ఇంతలోనే దొంగలు పడి, ఈ మొత్తం మాంసాన్ని ఎత్తుకెళ్లారు. ప్రభుత్వ ఆహార పంపిణీదారు COPMAR డైరెక్టర్ రిగోబెర్టో ముస్టెలియర్ మాట్లాడుతూ.. దొంగిలించబడిన ఈ 133 టన్నుల మాంసం, ఒక ప్రావిన్స్‌కు నెల రోజుల సరిపడా చికెన్‌కి సమానమని తెలిపారు. ఈ దొంగతనం తెల్లవారుజామున 2 గంటల మధ్య జరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ దోపిడీ జరగడానికి ముందు.. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గుల్ని అధికారులు గమనించినట్టు తెలిపారు. ఎవరిమీదైతే అభియోగాలు మోపబడ్డాయో.. ఆ 30 మందిలో ఈ ప్లాంట్‌లోనే పని చేసే షిఫ్ట్ బాయ్స్, ఐటీ ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డులు ఉన్నట్టు తేలింది. అసలు కంపెనీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఈ దోపిడీలో పాల్గొన్నారు. ఈ కేసులో నిందితులు దోషులుగా తేలితే మాత్రం.. వారికి 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z