DailyDose

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది-Telugu Horoscope-Feb 24 2024

ఆర్థిక పరిస్థితి బాగుంటుంది-Telugu Horoscope-Feb 24 2024

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):
దినఫలం:-వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. సన్నహితులతో విభేదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.ఓం నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
దినఫలం:-ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారమగును. అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలం. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తలచిన పనులలో ఆశించిన ఫలితాలు పొందగలరు. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.ఓం గౌర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
దినఫలం:-చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు. ఆర్థిక విషయాలు ఆందోళన కలిగిస్తాయి. బందు వర్గముతో విభేదాలు రాకుండా వ్యవహరించాలి. ఉద్యోగాల్లో అదనపు పని భారం పెరుగుతుంది. సమాజంలో మీ పరపతి తగ్గకుండా వ్యవహరించాలి. వ్యవహారాల్లో జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి.ఓం అంబికాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
దినఫలం:-ముఖ్యమైన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. బంధు వర్గముతో మాట పట్టింపులు రాగలవు. వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు రాగలవు. ఆరోగ్య సమస్యలు చికాకు పుట్టిస్తాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. నిష్కారణంగా కొంతమందితో విభేదాలు రాగలవు. ఓం భాస్కరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
దినఫలం:-ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పొందుతారు. ఇంటా బయటా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పలు విధాల ఆదాయ మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది.నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. వృత్తిపరంగా కొత్త అవకాశాలు పొందే అవకాశం.ఓం గౌరీ పుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
దినఫలం:-ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోవడం మంచిది. విలువైన వస్తువులతో జాగ్రత్త అవసరం. కుటుంబ విషయాలు ఆందోళన కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సమస్యలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కొని లాభాలు పొందగలరు. శత్రువులు పెరగకుండా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగాల్లో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండాలి.ఓం వినాయకాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
దినఫలం:-ఆర్థిక వ్యవహారాలు ఒడిదుడుకులుగా ఉంటాయి. అధికారులతో చిన్నపాటి వివాదాలు ఏర్పడగలవు.చేసే పనులలో ఓర్పు సహనం అవసరం. ప్రతి విషయానికి భయాందోళనకు గురి అవుతారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఓం శివాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
దినఫలం:-వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధి ఫలితాలు పొందగలరు. సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి. గత కొద్ది రోజులుగా పడిన శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కీలకమైన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన కార్యక్రమాల ఉత్సాహంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.ఓం భగవతే నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
దినఫలం:-చిన్నపాటి ఆర్థిక సమస్యలు రాగలవు. అనుకున్న వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురైన పట్టుదలతో పూర్తి చేయాలి. కొన్ని విషయాలు వలన మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ విషయాలు గందరగోళముగా ఉంటాయి. అనవసరమైన విషయాల వలన మానసిక చికాకులు పెరుగును. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఓం మహాలక్ష్మియై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
దినఫలం:-అన్ని రంగాల వారికి ఉత్సాహకరంగా ఉండును. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యవహారాల్లో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు.ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
అనుకున్న వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందగలరు. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ధనలాభం పొందగలరు. సమాజంలో ప్రజాదరణ పొందగలరు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేసే పని మీద దృష్టి సారించాలి. ఆర్థిక విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి విద్యా ఉద్యోగ అవకాశాలు లభించగలవు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
దినఫలం:-చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. సమాజంలో అపనిందులు రాకుండా వ్యవహరించాలి. వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరోత్సాహంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z