Politics

2029 నుండి జమిలి ఎన్నికలు-NewsRoundup-Feb 28 2024

2029 నుండి జమిలి ఎన్నికలు-NewsRoundup-Feb 29 2024

* వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

* వైకాపాకు మరో షాక్‌ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి (magunta sreenivasulu reddy) ఆ పార్టీని వీడారు. వైకాపాకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్‌. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు.. ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైకాపాను వీడుతున్నాం. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

* అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) నుంచి ప్రాంతీయ రింగ్‌ రోడ్డు (RRR)కు రేడియల్‌ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో హెచ్‌ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మాస్టర్‌ ప్లాన్‌ – 2050కి అనుగుణంగా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించాలని సూచించారు.

* భాజపా ఎంపీ బండి సంజయ్‌ (Bandi Sanjay) కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో బుధవారం చోటుచేసుకుంది. ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్‌ అక్కడ పర్యటిస్తున్నారు.

* గూగుల్‌ మ్యాప్స్‌.. తాజాగా లాక్‌ స్క్రీన్‌పైనే లొకేషన్‌ కనిపించే సదుపాయాన్ని యూజర్లకు పరిచయం చేసింది. సాధారణంగా గూగుల్‌ మ్యాప్స్‌లో మనం వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను అందిస్తే సమయం, షార్ట్‌కట్‌లు కనిపిస్తాయి. కొత్తగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మొబైల్‌ లాక్‌ స్క్రీన్‌పై ఈటీఏ (estimated time of arrival), వెళ్లాల్సిన ప్రదేశానికి డైరెక్షన్స్‌ ప్రత్యక్షమవుతాయి.

* మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2024) ఆసక్తికరంగా సాగుతోంది. గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (GG vs RCB) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ జరుగుతుండగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది. బెంగళూరు క్రికెటర్‌ శ్రేయాంక పాటిల్‌ (Shreyanka Patil)కి ఓ అభిమాని మ్యారేజ్‌ ప్రపోజల్‌ పెట్టాడు

* రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన క్రాస్‌ ఓటింగ్‌తో హిమాచల్‌ ప్రదేశ్ (Himachal Pradesh) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటు, మంత్రి రాజీనామాతో రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో పదవి నుంచి దిగిపోయేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

* మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. అయితే, కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

* గుంటూరు జిల్లాలోని వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎం.ప్రభుదాస్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రెండెకరాలకే అనుమతి తీసుకున్నారని.. 60 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసి అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్‌ ఎలా చేస్తారని.. ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది. అయితే, రెండు వారాల సమయం సరిపోదని న్యాయవాది చెప్పడంతో.. ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని వ్యాఖ్యానించింది. మైనింగ్‌ శాఖ ఇచ్చే నివేదికలో తేడాలు ఉండొద్దని.. అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. అవసరమైతే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా అధికారిని కోర్టుకు పిలుస్తామని తెలిపింది. తప్పని తేలితే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

*సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జమిలి ఎన్నికల (Simultaneous Polls)పై కొంతకాలంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశంపై అధ్యయనం చేసేందుకు ఇటీవల కేంద్రం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై కమిటీని కూడా వేసింది. ఈనేపథ్యంలోనే ‘జమిలి’ నిర్వహణపై లా కమిషన్‌ (Law Commission) త్వరలోనే కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించాయి. 2029 మే-జూన్ మధ్య ఏకకాల ఎన్నికలు నిర్వహించేలా ‘లా కమిషన్‌’ ప్రతిపాదించనుంది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని చేర్చేలా సవరణలకు కమిషన్‌ సిఫార్సు చేయనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అలాగైతే 19వ లోక్‌సభకు నిర్వహించే సార్వత్రిక ఎన్నికలతో పాటే రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు పోలింగ్ నిర్వహంచే వీలు ఉంటుందని కమిషన్‌ అభిప్రాయపడుతున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

* ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంతో ప్రజల తీర్పును తుంగలోకి తొక్కి, హిమాచల్‌ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం సృష్టించేందుకు భాజపా (BJP) ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడిన కాంగ్రెస్‌ (Congress) ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై ప్రియాంక స్పందించారు. ‘‘హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు తమ ఓటుహక్కు ద్వారా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కానీ, అధికార దుర్వినియోగంతో వారి తీర్పును అణచివేసేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం యత్నిస్తోంది. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ.. 43మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని సవాల్‌ చేస్తోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతుందనేందుకు ఇదే నిదర్శనం. ఇది పూర్తిగా అనైతికం, రాజ్యాంగ విరుద్ధం హిమాచల్‌ ప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా ప్రజలు భాజపా చర్యలను గమనిస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రజలను ఆదుకోని కేంద్రం ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ సంక్షోభంలోకి నెట్టాలని చూస్తోంది’’ అని ప్రియాంక ఆరోపించారు.

* భారత్‌ చేతిలో ఐదు టెస్టు సిరీస్‌లను (IND vs ENG) మరో మ్యాచ్‌ ఉండగానే ఓడిపోవడంపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మెక్‌కల్లమ్‌ – బెన్‌ స్టోక్స్‌ జోడీ తీసుకొచ్చిన ‘బజ్‌బాల్’ (Bazball) వల్ల బ్యాటింగ్ దెబ్బతిందని ఇంగ్లాండ్‌ క్రికెట్ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z