NRI-NRT

ముగిసిన మన్నం అంత్యక్రియలు

Mannam Venktararamana Final Rituals Completed

ప్రకాశం జిల్లాకు చెందిన న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు మన్నం వెంకటరమణ అంత్యక్రియలు హైదరాబాద్‌లో గురువారం నాడు నిర్వహించారు. ఎంతోమందికి ఉపాధి కల్పనకు బాటలు వేసి, మార్గదర్శిగా నిలిచిన ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఎల్బీనగర్‌లోని ఆయన నివాసం నుండి జుబ్లీహిల్స్ మహాప్రస్థానానికి ఆయన పార్ధివదేహాన్ని తీసుకువెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. రమణ స్నేహితులు వేమన సతీష్, కొల్లా అశోక్‌బాబు, తాతా మధు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొని తమ చిరకాల మిత్రునికి వీడ్కోలు తెలిపారు.



👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z