Agriculture

చిత్తురు జిల్లా బేనీషా మామిడి…టన్ను ₹2లక్షలు

చిత్తురు జిల్లా బేనీషా మామిడి…టన్ను ₹2లక్షలు

మామిడి పంట దిగుబడిలో చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. టేబుల్‌ రకం కాయల సాగులో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏటా ఈ ప్రాంతం నుంచి మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 10శాతం పంటైనా దిగుబడి రాలేదు. దీంతో ఉన్న పంటకు మార్కెట్‌లో గిరాకీ పెరిగింది. కనీవినీ ఎరుగని రీతిన మార్కెట్‌లో ధరలు భగభగ మండుతున్నాయి. ఫలరాజుగా పేరొందిన బేనీషా మామిడి పండ్లు టన్ను ప్రస్తుతం రూ.2లక్షలకు అమ్ముడవుతోంది. సామాన్యులు దీన్ని కొనలేకున్నా సాగు చేసిన రైతులకు సిరులు కురిపిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z