ఫ్యాషన్‌లో మరో ట్రెండ్ జోరందుకుంది. బ్లేజర్లు, జాకెట్లు కొత్తదనాన్ని అద్దుకున్నాయి. మెరుస్తూ మెప్పించాయి. ఎక్కడంటారా? ఇంకెక్కడ మన ఆస్కార్ వేడుకలో…! నటులు ధరించిన బ్లేజర్లు, జాకెట్లను చూసిన వారంతా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆక్వామెన్ హీరో జాన్సన్, కెప్టెన్ అమెరికా నటుడు చారిస్ వేసిన బ్లేజర్లు గమనించారా? ఆ గుర్తొచ్చింది కదూ! వెల్‌వెట్ బ్లేజర్లు. జాన్సన్ ఏమో పింక్ వెల్‌వెట్లో మెరిసిపోగా… లైట్ బ్లూ వెల్‌వెట్ జాకెట్లో చారిస్ ఆకట్టుకున్నాడు. ఇలా ఎక్కువ మంది వెల్‌వెట్ జాకెట్లు వేసుకొని వచ్చి కొత్త ట్రెండ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. వెల్‌వెట్ వస్త్రంతో గతంలో మహిళలు బ్లౌజ్‌లు, షార్ట్ జాకెట్లు డిజైన్ చేయించుకునే వారు. ఇప్పుడు వెల్‌వెట్ పురుషులనూ ముంచెత్తింది. ఈ క్లాత్ నైట్ పార్టీలు, ఫంక్షన్లలో మనల్ని ప్రత్యేకంగా మెరిపిస్తుంది. అందుకే యువతా ఇదే బాటపడుతున్నారు.
ఇప్పుడంతా వెల్వెట్ లుక్స్‌కే ప్రాధాన్యత

Related tags :