DailyDose

ఉభయ రాష్ట్రాల్లో పోలింగ్ సరళిపై TNI కధనాలు

2019 election polling news

*ఒకరి మృతి.. పలువురికి గాయాలువైకాపా దాడి.. సొమ్మసిల్లిన కోడెల
సిరాచుక్క పడాల్సిన చోట.. రక్తం చిందింది. అన్నదమ్ముల్లా మెలిగే గ్రామాల్లో హింస చెలరేగింది. రాళ్లదాడులు, కర్రదాడులు, చొక్కాలు చింపేయడాలు.. ఇవీ ఏపీలో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియకు నిదర్శనాలు. రాష్ట్రంలో పలు చోట్ల తెదేపా, వైకాపా వర్గాల మధ్య జరిగిన దాడులతో పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. పలు చోట్ల కర్రలు, రాళ్ల దాడులు జరగడంతో ఒకరు మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి.
*సభాపతిపై దాడి..
గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో సభాపతిపై వైకాపా వర్గీయుల దాడి చేసి చొక్కా చించివేశారు. పోలింగ్ బూత్‌లోకి కోడెల వెళ్లడంపై వైకాపా కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తంచేశారు. అనంతరం రెండు పార్టీల ఏజెంట్లు గొడవకు దిగారు. ఈ క్రమంలో సభాపతి చొక్కాను వైకాపా కార్యకర్తలు చించివేశారు. ఈ క్రమంలో కోడెల సొమ్మసిల్లారు. ఆయన కారు అద్దాలనూ పగలగొట్టారు.
*‘అనంత’లో ఒకరి మృతి..
అనంతపురంలో పోలింగ్‌ హింసాత్మకంగా మారింది. తాడిపత్రి మండలం మీరాపురంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. వైకాపా నాయకుల దాడిలో తెదేపా నేత చింతా భాస్కర్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్‌రెడ్డిని అనంతపురం ఆస్పత్రికి తరలించిన అనంతరం మృతిచెందారు. ఇదే జిల్లాలో రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సిద్ధ రామాపురంలో పోలింగ్‌ కేంద్రంలోనే తెదేపా, వైకాపా కార్యకర్తలు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. అదే మండలం అనప గ్రామంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు.
* గుడివాడలో ఆలస్యంగా వెలుగుచూసిన మోసం..
కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని ఆర్.సి.ఎం చర్చ్ 43వ బూత్‌లో బల్క్‌గా ఓటర్ ఐడీ కార్డులు గుర్తించారు. అంగన్‌వాడీ మహిళ వద్ద 200 ఓటర్ కార్డులు ఉండటంతో అధికారులు ఆశ్చర్యపోయారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వారికే అంగన్‌వాడీ మహిళలు కార్డులు పంపిణీ చేశారు. ఉదయం నుంచి పంపిణీ చేస్తున్నా.. టీడీపీ ఏజెంట్లు మాత్రం ఆలస్యంగా గుర్తించారు. టీడీపీ అభ్యంతరంతో వైసీపీ ఏజెంట్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంగన్‌‌వాడీ మహిళకు వైసీపీ ఏజెంట్లు మద్దతుగా నిలిచారు. ఇరువర్గాలకు డీఎస్పీ మహేష్ సర్దిచెప్పారు. 144 ఓటర్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్వో ఆదేశాల మేరకు విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
* మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముగిసిన పోలింగ్
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముడిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకుపాడేరులో పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు. మావోలు ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
*ఉంది, తాడిపత్రి నియోజకవర్గాల్లో గొడవలు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెదేపా- వైకాప వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా కార్యకర్తల పై వైకాపా నాయకులూ దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొల్పాయి వెంటనే అక్కడకు చేరుకున్న బలగాలు ఇరు వర్గాలను సముదాయించి బయటకు పంపాయి.
*తెదేపా నేత వాహనం పై దాడి. మహిళా ఓటరు ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా గుత్తి గర్ల్స్ కాలేజీలో పోలింగ్ బూత్ లో అభ్యర్దే ఈవీఎం ను
*అఖిలప్రియ సోదరి కారు ధ్వంసం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం అహోబిలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ సోదరి భూమా నాగమౌనిక కారు అద్దాలను వైకాపా వర్గీయులు ధ్వంసం చేశారు. దీంతో నాగమౌనిక పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగుల వర్గీయులు వాహనాల్లో రాళ్లు, కర్రలతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు.
*ఇదే నియోజకవర్గం అహోబిలంలో తెలుగుదేశం, వైకాపా వర్గాల మధ్య బాహాబాహి జరిగింది. ఇరువర్గాలు కర్రలతో కొట్టుకుంటూ.. రాళ్లు రువ్వకున్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి తోపాటు, స్వతంత్ర్య అభ్యర్ధి కుందూరు రామిరెడ్డి, మరో ఆరుగురు గాయపడ్డారు.
*ప్రకాశం జిల్లా చీరాలలో వైకాపా నాయకుడు, మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు 103 పోలింగ్ బూత్‌లో హల్‌చల్‌ చేశారు. ఓటు వేసేందుకు లోపలికి వచ్చిన ఆయనను గుర్తింపు కార్డు ఏదని ఏజెంట్ అడగడంతో.. ఆయన బూతు పురాణం అందుకున్నారు. బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు. దీంతో అక్కడకు చేరుకున్న తెదేపా ఏజెంట్లు మంచి పద్ధతి కాదని వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్ది చెప్పి పంపించేశారు.
* చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతాపం చూపబోయారు. రామచంద్రాపురం మండలం రాయుల్లవారిపల్లెలో తమకు అనుకూలంగా ఓట్లు వేయడంలేదని గ్రామస్థులపై దుర్భాషలాడారు. దీంతో గ్రామస్థులు చెవిరెడ్డిపై తిరగబడ్డారు. వెంటనే అక్కడి నుంచి చెవిరెడ్డి తిరిగి వెళ్లిపోయారు.
* మాచర్లలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ పోలీసుల కాల్పులకు దారితీసింది. ఆందోళనకారులను నిలవరించడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.
* అఖిలప్రియ అనుచరులిద్దరిని వైసీపీ పార్టీ వారు కిడ్నాప్ చేశారంటూ..
అళ్ళగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భూమా అఖిల ప్రియ అనుచరులిద్దరిని వైసీపీ పార్టీ వారు కిడ్నాప్ చేశారంటూ నడిరోడ్డు మీద ఆంధోళనకు దిగారు భూమా కుటుంబ సభ్యులు. తమ అనుచరులను విడుదల చేయకపోతే..గంగుల ఇంటి ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు భూమా అఖిల ప్రియ. పోలింగ్ అధికారులు , పోలీసులు కుమ్ముక్కయ్యారని భూమా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
* టీడీపీ, వైసీపీ మధ్య గొడవ – ఇద్దరు మృతి
హైదరాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు హింసాత్మ‌కంగా మారాయి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తాడిపత్రి నియోజకవర్గంలోని వీరాపురంలో ఇరు పార్టీల కార్యకర్తలు వేట కొడవళ్లు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకుని భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఘర్షణలో టీడీపీ నాయకుడు సిద్ధా భాస్కర్‌ రెడ్డి, వైసీపీ కార్యకర్త పుల్లా రెడ్డి మృతి చెందారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీరాపురంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
* మాచవరంలో టీడీపీ ఏజెంట్లపై వైసీపీ దాడి
కందుకూరు వైసీపీ అభ్యర్థి మహిధర్‌రెడ్డి సొంతూరు మాచవరంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ ఏజెంట్లపై దాడికి తెగబడ్డారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి ఏజెంట్లను మహిధర్‌రెడ్డి, ఆయన అనుచరులు తరిమేశారు. కలెక్టర్‌ ఆదేశించినా కందుకూరు ఆర్డీవో పట్టించుకోలేదు. రీపోలింగ్‌ నిర్వహించాలని కలెక్టర్‌కు టీడీపీ నేతల వినతిపత్రం అందజేశారు.
*తెదేపా నేత వాహనం పై దాడి. మహిళా ఓటరు ఆత్మహత్యా యత్నం
అనంతపురం జిల్లా గుత్తి గర్ల్స్ కళాశాలలో పోలింగ్ బూత్ లో అభ్యర్దే ఈవీఎంను ధ్వంసం చేసారు. పోలింగ్ ఏర్పాట్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన గుంతకల్ అభ్యర్ధి మధుసూదన్ గుప్తా.. ఈవీఎంను ద్వంసం చేసారు. ఆ తరువాత గుత్తి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. మోసపూరిత ఎన్నికలు అపలంటూ నినాదాలు చేసారు.
*గుంటూరు జిల్లా నరసరావుపేట తెదేపా అభ్యర్ధి చదలవాడ అరవింద బ్బు కారుపై దాడికి తెగబడ్డారు. పోలింగ్ బూత్ వద్ద సరళిని పరిశీలించడానికి వచ్చిన ఆయన కారు పై ఒక్కసారిగా దాడికి దిగారు.
*కర్నూలు జిల్లాలో తన ఓటు గల్లంతిందని ఆత్మహత్యాయత్నం చేసిందో మహిళా. ఆదోని లోని 191 పోలింగ్ బూత్ లో తన ఓటు గల్లంతిందని పోలింగ్ అధికారుల వద్దకు వెళ్తే మీ ఓటు లేదు పోమ్మంతున్నారని శ్తానికులు ఆరోపిస్తున్నారు.
*నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మకూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్ధి మేకపాటి గౌతం రెడ్డి సొంత వూరు మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో వైకాపా కార్యకర్తలు నియత్రుత్వ పోకడలతో పలపడుతున్నారు బ్రాహ్మణా పల్లిలో తెదేపా అభ్యర్ధి బొల్లినేని క్రిష్నయ్య సోదరుడు శ్రీనివాసులు నాయుడు బ్రహ్మనపల్లికి చేరుకునారు స్థానికేతరుడు పోలింగ్ బూత్ కు ఎలా వస్తాదంటూ అడ్డుకున్నారు వైకాపా కార్యకర్తలు దీంతో బ్రాహ్మణపల్లిలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో బ్రహ్మనపల్లికి బొల్లినేని క్రిశాన్య్య చేరుకొని అక్కడే బైతయించారు.
*పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో తెదేపా వైకాప వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా కార్యకర్తలపై వైకపా నాయకులూ దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అక్కడకు చేరుకున్న బలగాలు ఇరు వర్గాలను సముదాయించి బయటకు పంపాయి.