Movies

ట్వింకిల్ సంతాప చిత్రం

twinkle khanna last tribute picture

శుక్రవారం ట్వింకిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫన్నీ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘డేంజర్‌ కీప్‌ ఔట్’ అని రాసున్న సైన్‌బోర్డు ముందు ట్వింకిల్‌ భయంకరంగా చూస్తున్నట్లుగా ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో అది. ఈ ఫొటోను ట్వింకిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ..‘నా కొత్త ఫొటో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మన మనసులోని ఫీలింగ్స్‌ను ఫొటో రూపంలో తీయడమనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. నేను చనిపోయినప్పుడు ఈ ఫొటోను ఫ్రేమ్‌ చేసి దానిపై గులాబీ పూల మాలలు వేస్తారని, నా సంతాప సభలోనూ ఇదే ఫొటోను వాడతారని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు.