Food

పంజాబీ చేప బిరియానీ తయారీ విధానం

punjabi fish biriyani easy and short recipe

????????????☘?????????☘???????????????☘????????????
కావలసినవి::: బాస్మతిబియ్యం: అరకిలో, చేపముక్కలు: ముప్పావుకిలో, నూనె: 100గ్రా., టొమాటోలు: నాలుగు, ఉల్లిపాయలు: నాలుగు, అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు,నిమ్మరసం: టేబుల్‌స్పూను, పెరుగు (గిలకొట్టినది): కప్పు, పచ్చిమిర్చి: పది, కొత్తిమీర: 2 కట్టలు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం ::: చేపముక్కల్ని శుభ్రంగా కడగాలి. తరవాత పెరుగులో సగం తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి, నిమ్మరసం వేసి బాగా కలిపి ముక్కలకు పట్టించి పక్కన ఉంచాలి. బియ్యం కడిగి అరగంటసేపు నాననివ్వాలి. నానబెట్టిన బియ్యంలో, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కాస్త పలుకు ఉండేలా ఉడికించి దించాలి. మరో బాణలిలో నూనె వేసి ఉల్లిముక్కలు వేయించి, సగం తీసి పక్కన ఉంచాలి. టొమాటోముక్కలు, మిగిలిన పెరుగువేసి కలుపుతూ ఐదారు నిమిషాలు వేయించాలి. మసాలా పట్టించిన చేపముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి మీడియం మంటమీద ఉడికించాలి. పాన్‌లో అడుగున ఉడికించిన అన్నం కొద్దిగా పరిచి దానిమీద కాస్త చేపలకూర, కాస్త కొత్తిమీరతురుము, వేయించి ఉంచిన కాసిని ఉల్లి ముక్కలు చల్లాలి. దీనిమీద మళ్లీ అన్నం పరిచి మిగిలిన కూరమిశ్రమం, కొత్తిమీరతురుము, ఉల్లిముక్కలు చల్లాలి. దానిమీద మిగిలిన అన్నం వేసేసి మూతపెట్టి సిమ్‌లో పావుగంటసేపు ఉడికించి దించాలి.
????????????☘?????????☘???????????????☘????????????