Devotional

ఖైరతాబాద్ గణేశుడికి అంకురార్పణ

the creative form of khairatabad ganesh in 2019

ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది భక్తులకు మరో అద్భుతమైన రూపంలో కనువిందు చేయనున్నారు. ఈ మేరకు నేడు విగ్రహ ప్రతిష్ఠాపనకు అంకురార్పణ చేస్తున్నారు. ఈ సం దర్భంగా 20 అడుగుల ఎత్తైన కర్రకు పూజ నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ పి. విజయారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి హాజరవుతున్నారని గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగారి సుదర్శన్ తెలిపారు.