Movies

న్యూజెర్సీలో సినీనటుడు సుమన్‌కు సన్మానం

actor suman felicctated by tfas in new jersey

తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో ఏప్రిల్‌ 20న శ్రీ వికారినామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 800 మంది తెలుగు వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు కళా సమితి కార్యవర్గం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సినీనటుడు సుమన్‌ని తెలుగు కళా సమితి కార్యవర్గం సత్కరించి ఉగాది ప్రత్యేక పురస్కారం అందజేశారు.